AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పోలీస్ స్టేషన్‌లో దొంగలు పడ్డారు..! ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎవరింట్లో అయినా దొంగలు పడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం..! మరి పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం జరిగితే, ఎవరికి చెప్పుకోవాలి. సరిగ్గా ఇలాంటి పరిస్థితి శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ పోలీసులకు ఎదురైంది. అసలు పోలీస్ స్టేషన్ లో దొంగతనం చేయడానికి ఏముంటుంది రా బాబూ..!

Andhra Pradesh: పోలీస్ స్టేషన్‌లో దొంగలు పడ్డారు..! ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Nallamada Police Station
Nalluri Naresh
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 22, 2024 | 11:45 AM

Share

ఎవరింట్లో అయినా దొంగలు పడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం..! మరి పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం జరిగితే, ఎవరికి చెప్పుకోవాలి. సరిగ్గా ఇలాంటి పరిస్థితి శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ పోలీసులకు ఎదురైంది. అసలు పోలీస్ స్టేషన్ లో దొంగతనం చేయడానికి ఏముంటుంది రా బాబూ..! అనుకుంటున్నారా? అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

నల్లమాడ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి కంప్యూటర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం కార్యాలయం తలుపులు తెరిచి చూసిన సిబ్బంది షాక్ అయ్యారు. కంప్యూటర్ తోపాటు ప్రింటర్ కనిపించకపోవడంతో సిబ్బందికి ఏం జరిగిందో అర్థం కాలేదు. చాలాసేపటి తర్వాత కంప్యూటర్ చోరీకి గురైనట్లు పోలీస్ సిబ్బంది నిర్ధారించుకున్నారు. సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయానికి రాత్రి తాళాలు వేయకుండా తలుపులు దగ్గరకు వేసి సిబ్బంది వెళ్ళిపోయారు. తాళాలు వేయకపోవడంతో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. అయితే రాత్రి డ్యూటీలో ఇద్దరూ సెంట్రీలు కాపలా ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్‌లో దొంగతనం జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నల్లమాడ సర్కిల్ పరిధిలోని నల్లమాడ, ఓబుళదేవరచెరువు, ఆమడగురు పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సమాచారం మొత్తం సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయంలోని కంప్యూటర్‌లోనే ఉంటుంది. పోలీస్ స్టేషన్‌లో దొంగతనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యినట్లు సమాచారం. అయితే ఇప్పుడు చోరీకి గురైన కంప్యూటర్ లోని డేటాను ఎలా రికవరీ చేయాలనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయంలో జరిగిన చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న. పోలీస్ స్టేషన్ లోని సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయంలోనే చోరీ జరగడంతో… స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..