దొంగతనానికి వచ్చి ఏసీ వేసుకుని పడుకున్నాడు.. పొద్దున్నే పోలీసులు వచ్చి లేపారు.. ఇంకో ట్విస్ట్ కూడా..
Thief Sleep Thailand: 64 కళల్లో చోర కళ కూడా ఒకటి అంటారు. తమ పని కూడా ఎంతో క్రియేటివిటీతో కూడిందని దొంగలు భావిస్తుంటారు. ఓ ఇంటిలో దొంగతనానికి దిగాలంటే ఎన్నో స్కెచ్‌లు వేస్తారు, నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. అయితే..
Thief Sleep Thailand: 64 కళల్లో చోర కళ కూడా ఒకటి అంటారు. తమ పని కూడా ఎంతో క్రియేటివిటీతో కూడిందని దొంగలు భావిస్తుంటారు. ఓ ఇంటిలో దొంగతనానికి దిగాలంటే ఎన్నో స్కెచ్‌లు వేస్తారు, నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ దొంగ మాత్రం దీనికి భిన్నంగా చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌లోని ఫెట్చబూన్ ప్రావిన్స్‌కు చెందిన అతిట్ కిన్ కుంతుబ్ అనే 22 ఏళ్ల ఓ యువకుడు స్థానికంగా ఉన్న ఓ ఆఫీసర్ ఇంటికి దొంగతనానికి వెళ్లాడు. అయితే దొంగతనం చేయడం కోసం ఎంతలా ప్లాన్ వేశాడో కానీ.. ఇంటికి వెళ్లే సరికి బాగా అలసిపోయాడు. కాసేపు విశ్రాంతి తీసుకొని దొంగతనం చేద్దాం అనుకున్నాడు. దీంతో ఆఫీసర్ కూతురు గదిలోకి వెళ్లి బెడ్‌పై పడుకున్నాడు. అయితే ఆ సమయంలో ఆ ఆఫీసర్ కూతురు ఊరికి వెళ్లింది. ఇక గదిలో ఏసీ గాలి చల్లగా రావడంతో నిద్రలోకి జారుకున్నాడు. ఎంతలా అంటే.. ఉదయం వరకు అలాగే నిద్రపోయాడు. ఇక తర్వాత రోజు ఉదయం ఇంటికి వచ్చిన ఆఫీసర్ కూతురు గదిలో ఎవరో పడుకొని ఉండడాన్ని గమనించాడు. ఊరికి వెళ్లిన తన కూతురు వచ్చిందనుకొని నిద్రలో నుంచి లేపే క్రమంలో దుప్పటిని తొలగించాడు. దీంతో అక్కడ వ్యక్తి ఉండడాన్ని గమనించిన ఆఫీసర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని నిద్రలో నుంచి లేపి.. ‘ఇక్కడ పడుకుంది చాలు కానీ.. పోలీస్ స్టేషన్‌లో కునుకు తీద్దువు పదా’ అన్నట్లు అక్కడి నుంచి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట్లో తెగ నవ్వులు పూయిస్తున్నాయి.
Also Read: మాటలతో మభ్యపెడతాడు.. అవసరం తెలుసుకుని దగ్గరవుతాడు.. సాయం చేస్తానని నగలతో పరార్
అర్థరాత్రి మందుబాబుల వీరంగం… మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్.. ఏఎస్సైకి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
Myanmar Violence: మయన్మార్‌లో దారుణం.. రెచ్చిపోయిన భద్రతా బలగాల కాల్పులు.. 90 మందికిపైగా మృతి..