పెట్రోల్‌ దాడిలో గాయపడ్డ వాచ్‌మెన్‌ మృతి..అసలేం జరిగింది..?

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి పెట్రోల్‌ దాడిలో గాయపడ్డ వాచ్‌మెన్‌ శరణప్ప చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శరణప్ప శుక్రవారం రాత్రి చనిపోయాడు. దీంతో పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితులైన మాధవ్‌రెడ్డితోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు మాధవరెడ్డి తన పలుకుబడితో కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. బోయిన్‌పల్లి ఆర్యవైశ్యకాలనీలోని శివ ఎన్‌క్లేవ్ హౌసింగ్ సొసైటీ స్థలం వద్ద కర్నాటకకు చెందిన శరణప్ప […]

పెట్రోల్‌ దాడిలో గాయపడ్డ వాచ్‌మెన్‌ మృతి..అసలేం జరిగింది..?
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Dec 14, 2019 | 4:25 PM

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి పెట్రోల్‌ దాడిలో గాయపడ్డ వాచ్‌మెన్‌ శరణప్ప చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శరణప్ప శుక్రవారం రాత్రి చనిపోయాడు. దీంతో పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితులైన మాధవ్‌రెడ్డితోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు మాధవరెడ్డి తన పలుకుబడితో కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు.

వివరాల్లోకి వెళితే.. బోయిన్‌పల్లి ఆర్యవైశ్యకాలనీలోని శివ ఎన్‌క్లేవ్ హౌసింగ్ సొసైటీ స్థలం వద్ద కర్నాటకకు చెందిన శరణప్ప వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల ఏడోతేదీన ఇద్దరు వ్యక్తులు శరణప్పై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. వివాదంలో ఉన్న  స్థలంకోసం స్థానికంగా ఉండే ప్రభాకర్‌రెడ్డి, మాధవరెడ్డి మధ్య గొడవ జరుగుతోంది. దీంతో ప్రభాకర్‌రెడ్డి ఆ స్థలంలో శ్రీనివాస్ అనే వ్యక్తిని వాచ్‌మెన్‌గా నియమించాడు. ఈ క్రమంలోనే మాధవరెడ్డి వివాద స్థలంలో ఉన్న ప్రహారీగోడను కూల్చివేస్తుండగా వాచ్‌మెన్‌ కుటుంబసభ్యులు అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అతనిపై కక్ష్యపెంచుకున్న మాధవరెడ్డి…తమపైనే ఫిర్యాదు చేస్తావా అనే అక్కసుతో అనుచరులతో కలిసి అర్ధరాత్రి సమయంలో వాచ్‌మెన్‌ ఇంటిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. ప్రమాదంలో శ్రీనివాస్‌ ఇంట్లో ఉన్న మరో వాచ్‌మెన్‌ శరణప్ప మంటల్లో తీవ్రంగా గాయపడ్డాడు. 40 శాతం పైగా కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఇదిలా ఉంటే, సొసైటీలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న భూవివాదంలో భాగంగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ వర్గానికి మద్దతుగా తెలంగాణలోని ఓ మంత్రి పోలీసులపై ఒత్తిడి తెచ్చారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ని రహస్యంగా విచారించినట్లు సమాచారం. అయితే ఈ కేసుతో తనకు గానీ, తన వారికి గానీ ఎలాంటి సంబంధం లేదని సదరు మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. తాము ఏ భూవివాదంలోనూ తలదూర్చలేదని తెలిపారు. అధికారంలో ఉన్నందున తమను రోజూ ఎంతోమంది వచ్చి కలుస్తుంటారని, ఎవరో చేసిన పనిని తమకు అంటగట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మొత్తానికి ఈ కేసులో పెద్ద మనుషుల ప్రమేయం ఉండటంతో పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది.