Family Planning Operation: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మృతి
Family Planning Operation: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మృతి చెందారు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో చోటు చేసుకుంది...
Family Planning Operation: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మృతి చెందారు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో చోటు చేసుకుంది. విషమంగా ఉన్న మహిళకు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో 27 మంది మహిళలు ఈనెల 25వ తేదీన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు. వీరిలో నలుగురు మహిళలు తీవ్ర అస్వస్థకు గురి కాగా, ముందుగా ఇద్దరు మృతి చెందగా, మిగతా ఇద్దరు కూడా ప్రాణాలు విడిచారు. మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత, మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుష్మ, ఇబ్రహీంపట్నంలోని సీతారాంపేటకు చెందిన లావణ్యం, మరో మహిళ ఈనెల 25వ తేదీన కుని ఆపరేషన్ నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. వీరికి కుటుంబ నియంత్రణ జరిగిన తర్వాత ఇంటికి వెళ్లారు. ఇంట్లో తీవ్ర అస్వస్థకు గురి కావడంతో మమతను బీఎన్‌రెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే మరి కొందరు అస్వస్థకు గురి కాగా వారిని హైదరాబడాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అలాగే సుష్మను కూడా మరో ఆస్పత్రిలో చేర్పించగా, ఆమె కూడా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె కూడా మృతి చెందింది. మరో మహిళ లావణ్యను హైదరాబాద్‌లోని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. ఇలా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మొత్తం నలుగురు మహిళలు మృతి చెందినట్లు ఆస్పత్రి ఆస్పత్రి డీఎంహెచ్ ఓ శ్రీనివాస్ తెలిపారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు వికటించడం వల్లనే ఇలా జరిగిందని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వైద్యాధికారులు స్పందించారు. ఆపరేషన్లలో పొరపాటు ఏమి జరగలేదని, ఆరోగ్యం పూర్తిగా పరిశీలించాకే ఇంటికి పంపించామంటున్నారు.
అయితే మొత్తం 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరుగగా, అందులో నలుగురు మృతి చెందారు. 11 మంది అపోలో ఆస్పత్రికి తరలించగా, 3 ముగ్గురిని తరలించారు. అలాగే 15 మంది ప్రస్తుతం ఇబ్రాహీంపేట ఆస్పత్రిలో ఉన్నారు. యాచారం నుంచి 5 , ఆరుట్ల నుంచి 4 , ఎలిమినేడు నుంచి 7, మాడుగుల నుంచి 4, మంచాల నుంచి 2, దండుమైలారం నుంచి 2, ఇర్విన్ నుంచి 2, ఇబ్రహీంపట్నం నుంచి 8 మందికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిగాయి.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం..
ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో శ్రీనివాస్ మాట్లాడుతూ.. కుటుంబ నియంత్రణ చేసుకున్న మహిళలు నలుగురు చనిపోయారని, ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. మృతి చెందిన నలుగురు మహిళ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. తీవ్ర అస్వస్థకు గురైన వారిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే వారికి డబుల్ బెడ్‌రూమ్‌లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేవి రెగ్యులర్‌గా చేసేవని అన్నారు. ఈ ఏడాది కూడా రెగ్యులర్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని, ఇందులో భాగంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి