Hyderabad: పేకాటాడుతూ అడ్డంగా దొరికిపోయిన కార్పొరేటర్ల భర్తలు.. పోలీసులను చూసి ఏంచేశారంటే!
పేకాటపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ కొందరు పేకాట రాయుళ్లు నగర శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్‌ను అడ్డాగా యధేచ్చగా కొనసాగిస్తున్నారు.
Playing Cards Gambling Case:పేకాటపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ కొందరు పేకాట రాయుళ్లు నగర శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్‌ను అడ్డాగా యధేచ్చగా కొనసాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో పేకాటాడుతున్న పందెంరాయుళ్ల గుట్టురట్టు చేశారు పోలీసులు. పట్టుబడిన వాళ్లంతా ప్రజా ప్రతినిధులు కావడం కలకలం రేపుతోంది. దొరికిపోయిన వాళ్లంతా కార్పొరేటర్ల భర్తలు. ఎంతో హుందాగా.. నడుచుకోల్సింది పోయి. పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్ పరిధిలోని యాద్గార్‌పల్లిలో ఉన్న ఓ రిసార్ట్‌లో పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు పేకాట ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు.
పట్టుబడిన వారిలో ముగ్గురు కార్పొరేటర్ల భర్తల కూడా ఉన్నారు. అధికార పార్టీకి చెందిన జవహర్ నగర్ కార్పొరేషన్ 3వ డివిజన్ కార్పొరేటర్ భర్త బల్లి శ్రీనివాస్.. 4వ డివిజన్ కార్పొరేటర్ భర్త మరగొని వెంకటేష్.. 9వ డివిజన్ కార్పొరేటర్ భర్త మనోహర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 65 వేల 610 నగదు, 5 మొబైల్స్, 4 ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు.