Case on PT Usha: పరుగుల రాణి పిటి ఉషపై కేసు నమోదు చేసిన కోజికోడ్ పోలీసులు.. ఎందుకోసమంటే..?

భారత అథ్లెట్, స్వర్ణ పతక విజేత, ప‌రుగుల రాణి పీటీ ఉష‌పై కేర‌ళ‌ పోలీసులు కేసు న‌మోదు చేశారు. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేర‌కు ఉష‌పై కేసు న‌మోదు చేసినట్లు కోజికోడ్ పోలీసులు తెలిపారు.

Case on PT Usha: పరుగుల రాణి పిటి ఉషపై కేసు నమోదు చేసిన కోజికోడ్ పోలీసులు.. ఎందుకోసమంటే..?
Pt Usha
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 19, 2021 | 11:49 AM

Police Case on Athletic PT Usha: భారత అథ్లెట్, స్వర్ణ పతక విజేత, ప‌రుగుల రాణి పీటీ ఉష‌పై కేర‌ళ‌ పోలీసులు కేసు న‌మోదు చేశారు. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేర‌కు ఉష‌పై కేసు న‌మోదు చేసినట్లు కోజికోడ్ పోలీసులు తెలిపారు. ఉష‌తో పాటు మ‌రో ఆరుగురిపై సెక్షన్ ఐపీసీ 420 కింద కేసు న‌మోదైనట్ల వెల్లడించారు. ఇంటి నిర్మాణం కోసం కొంత మొత్తాన్ని చెల్లించానని, అయితే, హామీ ఇచ్చిన గడువులోగా ఇల్లు పూర్తి కాలేదని ఫిర్యాదుదారు జెమ్మా ఫిర్యాదు చేశారు.

జెమ్మా జోసెఫ్ కోజికోడ్‌లో 1,012 చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లాట్‌ను ఓ బిల్డర్ నుంచి కొనుగోలు చేసింది. ఆ ఫ్లాట్ కోసం జోసెఫ్ వాయిదాల రూపంలో మొత్తం రూ. 46 ల‌క్షలు చెల్లించింది. అయిన‌ప్ప‌టికీ ఫ్లాట్‌ను బిల్డ‌ర్ జోసెఫ్‌కు అప్ప‌గించ‌లేదు. అయితే, వ్యవహారానికి సంబంధించి పీటీ ఉష మధ్యవర్తిత్వం ద్వారా బిల్డ‌ర్‌కు ఆ మొత్తం డ‌బ్బులు చెల్లించాన‌ని, కానీ ఫ్లాట్ ఇవ్వ‌డంలో జాప్యం చేస్తున్నారని జోసెఫ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బిల్డ‌ర్‌తో పాటు ఉష త‌న‌ను మోసం చేశార‌ని జోసెఫ్ ఆరోపించింది. ఈ మేరకు జోసెఫ్ వెల్లయిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కోజికోడ్ పోలీసు చీఫ్ AV జార్జ్‌కు వివరణాత్మక విచారణ కోసం పంపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫిర్యాదుదారు కేరళ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి కూడా వెళ్లారు. అయినప్పటికీ, డబ్బులు తిరిగి చెల్లించేందుకు బిల్డర్ గానీ, పిటి ఊష గాని అంగీకరించలేదని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఉష‌తో పాటు మ‌రో ఆరుగురిపై ఐపీసీ 420 కింద కేసు నమోదు చేశారు. త్వరలో విచారణ ప్రారంభిస్తామని పోలీసులు చెప్పారు. నిర్మాణదారులపై నిఘా ఉంచే కేరళ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆధారంగా చర్య తీసుకుంటామన్నారు.

Read Also… Hyderabad: పేకాటాడుతూ అడ్డంగా దొరికిపోయిన కార్పొరేటర్ల భర్తలు.. పోలీసులను చూసి ఏంచేశారంటే!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?