Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఏంటి బ్రదర్ మరీ ఇలానా.. యూట్యూబ్ చానల్‌కు వ్యూస్ రావడం లేదని.. లైఫ్ ఎండ్

అర చేతిలో సెల్ ఫోన్.. దాని నిండా సోషల్ యాప్స్.. ముందు వ్యసనంగా, తర్వాత బానిసల్లా మార్చేసి, ఆఖరికి ప్రాణాలే తీసేస్తోంది. సరదాగా మొదలయ్యే వ్యాపకం చినికి చినికి గాలివానలా మారి తీవ్ర నష్టాన్ని మిగుల్చుతోంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ సోషల్...

Hyderabad: ఏంటి బ్రదర్ మరీ ఇలానా.. యూట్యూబ్ చానల్‌కు వ్యూస్ రావడం లేదని.. లైఫ్ ఎండ్
Student Suicide
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 21, 2022 | 1:42 PM

అర చేతిలో సెల్ ఫోన్.. దాని నిండా సోషల్ యాప్స్.. ముందు వ్యసనంగా, తర్వాత బానిసల్లా మార్చేసి, ఆఖరికి ప్రాణాలే తీసేస్తోంది. సరదాగా మొదలయ్యే వ్యాపకం చినికి చినికి గాలివానలా మారి తీవ్ర నష్టాన్ని మిగుల్చుతోంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో (Social Media) యాక్టీవ్ గా ఉంటున్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తహతహలాడుతున్నారు. తాము పెట్టే పోస్టులకు ఎక్కువ లైకులు రావడం కోసం ప్రమాదాలనూ లెక్క చేయడం లేదు. తక్కువ గా లైకులు వస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad) లో ఇలాంటి ఘటనే జరిగింది. యూ ట్యూబ్ ఛానల్ కు వ్యూస్ రావడం లేదంటూ ఓ విద్యార్థి బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ క్రాంతి నగర్ కాలనీలో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. క్రాంతి నగర్ లో ఓ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పేరు డీనా అని పోలీసులు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని, మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుుకని క్లూస్ టీమ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతి కేసు గా నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. యూట్యూబ్లో సెల్ఫ్ లో గేమ్ ఛానల్ ను నిర్వహిస్తున్న డీనా.. యూట్యూబ్లో వ్యూస్ పెరగడం లేదంటూ మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. డీనా ఐఐటీ గ్వాలియర్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి