కిల్‌ ‘లేడీ’..చంపడమే హాబీ..ట్విస్టుల మీద ట్విస్టులు…

పద్నాలుగేళ్ల వ్యవధిలో ఆరు హత్యలకు పాల్పడిన  సైకో సీరియల్ కిల్లర్ వ్యవహారం తెలిసిందే. ఆస్తి కోసం సైనేడ్ ను మటన్ సూప్ లో కలిపేసి ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఆరుగురిని చంపేసిన జాలీ వ్యవహారంలో కేరళ రాష్ట్ర పోలీస్ బాస్ లోక్ నాథ్ బెహ్రా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కాగా ఇలా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం సాక్షాత్తూ రాష్ట్ర డీజీపీనే రంగంలోకి దిగడం..చాలా అరుదనే చెప్పాలి. జాలీ షాజు (47) అనే మహిళ 2002 […]

  • Ram Naramaneni
  • Publish Date - 1:24 pm, Sun, 13 October 19
కిల్‌ 'లేడీ'..చంపడమే హాబీ..ట్విస్టుల మీద ట్విస్టులు...

పద్నాలుగేళ్ల వ్యవధిలో ఆరు హత్యలకు పాల్పడిన  సైకో సీరియల్ కిల్లర్ వ్యవహారం తెలిసిందే. ఆస్తి కోసం సైనేడ్ ను మటన్ సూప్ లో కలిపేసి ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఆరుగురిని చంపేసిన జాలీ వ్యవహారంలో కేరళ రాష్ట్ర పోలీస్ బాస్ లోక్ నాథ్ బెహ్రా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కాగా ఇలా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం సాక్షాత్తూ రాష్ట్ర డీజీపీనే రంగంలోకి దిగడం..చాలా అరుదనే చెప్పాలి.

జాలీ షాజు (47) అనే మహిళ 2002 నుంచి 2014 మధ్య తన మొదటి భర్తను, అతడి తల్లిదండ్రులను, తన రెండో భర్త మాజీ భార్యను, మరో ఇద్దరిని విషం పెట్టి చంపినట్లు అంగీకరించిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆమె 2014లో ఒక చిన్నారిని కూడా చంపినట్లు చెప్తున్నారు.జాలీ షాజుతో పాటు, ఆమెకు సాయం చేశారన్న ఆరోపణలతో మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేయగా.. అక్టోబర్ 16వ తేదీ వరకూ ముగ్గురినీ రిమాండ్‌కు పంపించారు. నిందితుల్లో ప్రాజీకుమార్ అనే స్వర్ణకారుడు ఆమెకు సైనేడ్ సరఫరా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే తనపై ఆరోపణలన్నీ అవాస్తవమని తాను నిర్దోషినని అతడు చెప్పినట్లు సమాచారం. ఎలుకలకు విషం పెట్టటానికి జాలీ తన దగ్గర సైనేడ్ కొన్నదని తాను భావించినట్లు అతడు పేర్కొన్నాడు.

ఎన్నో అనుమానాలు..ఎప్పుడు వీడతాయి చిక్కుముళ్లు:

జాలీ మొదటి భర్త రాయ్ థామస్ 2011లో చనిపోయారు. అతడి సోదరుడు రోజో థామస్ రెండు నెలల కిందట అధికారులను కలిసి తన అనుమానాలు వ్యక్తం చేయటంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. కాగా అనుమానాలు ఉంటే..అతడు ఇప్పటివరకు ఎందుకు పిర్యాదు చేయలేదని క్వచ్చన్స్ రైజ్ అవుతున్నాయి

జాలీ షాజు మొదటిగా 2002లో తన మొదటి అత్త అన్నమ్మ థామస్‌ను భోజనంలో విషం పెట్టి చంపిందని ఆరోపణ. ఆరేళ్ల తర్వాత జాలీ మొదటి మామ టామ్ థామస్ (66) కూడా అదే పరిస్థితుల్లో చనిపోయారు. ఆ తర్వాత 2011లో జాలీ మొదటి భర్త రాయ్ థామస్ చనిపోయారు. మృతదేహానికి నిర్వహించిన శవపరీక్షలో సైనేడ్ ఆనవాళ్లను గుర్తించారు. కానీ దాని మీద దర్యాప్తు చేయలేదు.

అయితే.. తన మేనల్లుడి మృతదేహానికి రెండోసారి శవపరీక్ష జరపాలని 2014లో అన్నమ్మ సోదరుడు మాథ్యూ పట్టుపట్టారు. ఆయన అదే ఏడాది  చనిపోవడం చర్చనీయాంశం అయింది.  2016లో రాయ్ థామస్‌కి సోదరుడు వరస అయ్యే స్కారియా షాజు భార్య చనిపోవటంతో ఆ కుటుంబంలో ఆందోళన పెరిగింది. రెండేళ్ల తర్వాత 2018లో స్కారియా షాజు కూతురు ఆల్ఫైన్ కూడా చనిపోయింది.

అనంతరం స్కారియా షాజును జాలీ పెళ్లి చేసుకుంది. ఈ ఆరుగురినీ తాను విషం పెట్టి హత్య చేసినట్లు జాలీ షాజు అంగీకరించిందని పోలీసులు చెప్తున్నారు. ఇందుకు కారణం డబ్బులేనని పేర్కొన్నారు. తన తల్లి మరణం తర్వాత కుటుంబ ఆర్థిక వ్యవహారాలను జాలీ షాజు తన చేతుల్లోకి తీసుకుందని ఆమె ఆడపడుచు రెంజీ చెప్పారు. జాలీని ఆదర్శవంతమైన కోడలని తన తండ్రి భావించేవారని కూడా ఆమె చెప్పడం గమనార్హం.

ఒక్కోక్కరిని ఒక్కోలా: 

జాలీ ఫ్మామిలీ మెంబర్స్‌‌ని చంపేందుకు ఒక్కొక్కరి ఒక్కో ఐటమ్‌ని ఎంచుకుంది. అత్తకు మటన్ సూప్‌లో…మామయ్యకు కాఫీలో సైనేడ్ కలిపి ఇచ్చింది. ఇలా ఒక్కొక్కరి ఒక్కో పానియంలో కలిపి పని పూర్తిచేసింది. మొదటి హత్యకు చివరి హత్యకు మధ్య పద్నాలుగేళ్ల గ్యాప్ ఉండటంతో హత్యలకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు కష్టమవుతుందని చెబుతున్నారు. చివరి హత్య జరిగి కూడా దాదాపు మూడేళ్లు కావటంతో.. నేరాన్ని నిరూపించటం అంత తేలికైన విషయం కాదంటున్నాయి అక్కడి పోలీసు వర్గాలు.

 జాలీ మానసిక పరిస్థితి ఏంటి? 

ఎప్పుడో పధ్నాలుగేళ్ల క్రితం వచ్చిన విక్రమ్‌ సినిమా అపరిచితుడు! చాలా పద్ధతిగా ఉండే లాయర్‌ రాము అపరిచితుడిలా మారి.. అవినీతిపరులకు గరుడ పురాణం ప్రకారం రకరకాలుగా మరణ శిక్షలు విధిస్తుంటాడు. ఆ విషయం తెలియని అతను… మళ్లీ రాము పాత్రలో ఒదిగిపోతుంటాడు. ఇది ‘స్ల్పిట్‌ పర్సనాలిటీ’ అనే రుగ్మత ఆధారంగా తీసిన సినిమా! సీరియల్‌ కిల్లర్‌ జాలీ జోసెఫ్‌ ఉదంతంతో అధికారులకు ఆ సినిమా గుర్తొస్తోంది. జూలీకి ‘స్ల్పిట్‌ పర్సనాలిటీ’ లక్షణాలు ఉన్నాయా అని అనుమానం కలుగుతోంది. అపరిచితుడు… అక్రమార్కులను మట్టుబెడితే, జాలీ ఆస్తి కోసం అయినవాళ్లు ఆరుగుర్ని సైనేడ్‌ పెట్టి చంపింది. విచారణలో భాగంగా పోలీసులు మానసిక నిపుణుల సహాయం తీసుకుంటున్నట్టు సమాచారం.
ఆడపిల్లలంటే పడదా? ఎందుకు?
జాలికి ఆడ పిల్లలంటే పడదట..!. ఇది ఎందుకో పోలీసులకు అర్టం కావడంలేదు. ఆమెకు మరిన్ని ప్రశ్నలు వేస్తుంది సిట్. భర్త సోదరి కుమార్తె ఆల్ఫాన్స్‌తో హత్యల సీరియల్ మొదలు పెట్టింది జాలి. అందరిని సైనేడ్‌తోనే చంపింది.