AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో రెచ్చిపోతున్న స్నాచర్లు..ప్రధాని సోదరుడి కుమార్తె హ్యాండ్‌ బ్యాగు చోరీ

దేశ రాజధానిలో ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ప్రధాని సోదరుడు ప్రహ్లాద్‌మోదీ కుమార్తె దమయంతి బెన్‌ మోదీ హ్యాండ్‌బ్యాగునే దుండగులు గుంజుకొని వెళ్లారు. ఈ మేరకు ఢిల్లీలోని సివిల్‌ లైన్స్‌ ఏరియా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ బ్యాగులో రూ.56 వేల నగదు, రెండు మొబైల్‌ ఫోన్‌లు, కొన్ని కీలక పత్రాలు ఉన్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శనివారం ఉదయం అమృతసర్‌ నుంచి ఢిల్లీ వచ్చిన దమయంతి బెన్‌ సివిల్‌ లైన్స్‌లోని గుజరాత్‌ సమాజ్‌ […]

ఢిల్లీలో రెచ్చిపోతున్న స్నాచర్లు..ప్రధాని సోదరుడి కుమార్తె హ్యాండ్‌ బ్యాగు చోరీ
Ram Naramaneni
|

Updated on: Oct 13, 2019 | 9:16 AM

Share

దేశ రాజధానిలో ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ప్రధాని సోదరుడు ప్రహ్లాద్‌మోదీ కుమార్తె దమయంతి బెన్‌ మోదీ హ్యాండ్‌బ్యాగునే దుండగులు గుంజుకొని వెళ్లారు. ఈ మేరకు ఢిల్లీలోని సివిల్‌ లైన్స్‌ ఏరియా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ బ్యాగులో రూ.56 వేల నగదు, రెండు మొబైల్‌ ఫోన్‌లు, కొన్ని కీలక పత్రాలు ఉన్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శనివారం ఉదయం అమృతసర్‌ నుంచి ఢిల్లీ వచ్చిన దమయంతి బెన్‌ సివిల్‌ లైన్స్‌లోని గుజరాత్‌ సమాజ్‌ భవన్‌లో గది బుక్‌ చేసుకున్నారు. భవన్‌ గేటు వద్ద దిగి లోపలికి వెళ్లే లోపునే బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ఆమె చేతిలో ఉన్న బ్యాగును లాక్కుని పారిపోయారు.

దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి సమీపంలోనే ఈ చోరీ జరిగింది. దమయంతి బెన్ మోడీ శనివారం ఉదయం అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి వచ్చారు. గుజరాతీ సమాజ్ భవన్‌లో ఒక గది కూడా బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. స్నాచింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?