దారుణం.. మహిళను సజీవ దహనం చేసిన గ్రామస్థులు..!
బిహార్‌లోని ఆరారియా జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళను అమానవీయంగా కొట్టి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను సజీవంగా దహనం చేశారు. ఈ ఘటనకు కారణం ఓ తొమ్మిది నెలల చిన్నారి మృతే కారణమని సమాచారం. ఆరారియా జిల్లా రాణిగంజ్‌లోని బెలగాచి గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. గ్రామానికి చెందిన ఓ తొమ్మిది నెలల బాలుడు బుధవారం రాత్రి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఉదయం ఎండుగడ్డిలో బాలుడి మృతదేహం కనిపించింది. ఆ పసివాడ్ని ఎవరో […]
బిహార్‌లోని ఆరారియా జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళను అమానవీయంగా కొట్టి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను సజీవంగా దహనం చేశారు. ఈ ఘటనకు కారణం ఓ తొమ్మిది నెలల చిన్నారి మృతే కారణమని సమాచారం. ఆరారియా జిల్లా రాణిగంజ్‌లోని బెలగాచి గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. గ్రామానికి చెందిన ఓ తొమ్మిది నెలల బాలుడు బుధవారం రాత్రి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఉదయం ఎండుగడ్డిలో బాలుడి మృతదేహం కనిపించింది. ఆ పసివాడ్ని ఎవరో అపహరించి ఉంటారని భావించిన గ్రామస్థులు ఓ మహిళపై అనుమానంతో దాడికి దిగి.. సజీవ దహనం చేశారు. బాలుడి తండ్రితో ఆ మహిళకు అక్రమ సంబంధం ఉండటం అనుమానాలకు తావిస్తోంది.