టెక్కీ మిస్టీరియస్ డెత్..భర్తపై పోలీసుల ఫోకస్
ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి కృష్ణా జిల్లా గన్నవరంలో కలకలం సృష్టించింది. గన్నవరం మండలం మర్లపాలెం చెరువులో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచార ఇవ్వడంతో వారు డెడ్‌బాడీని బయటకు తీశారు. చెరువు గట్టుపై మహిళకు సంబంధించిన స్కూటీ, హ్యాండ్ బ్యాగ్, కళ్ళజోడు, వాచ్‌ను స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మహిళ పుష్పలతగా గుర్తించారు. గన్నవరం రాంనగర్‌కు చెందిన ఆమె.. మేథా టవర్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. శనివారం సాయంత్రం ఫ్రెండ్‌ని కలిసివస్తానంటూ […]
ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి కృష్ణా జిల్లా గన్నవరంలో కలకలం సృష్టించింది. గన్నవరం మండలం మర్లపాలెం చెరువులో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచార ఇవ్వడంతో వారు డెడ్‌బాడీని బయటకు తీశారు. చెరువు గట్టుపై మహిళకు సంబంధించిన స్కూటీ, హ్యాండ్ బ్యాగ్, కళ్ళజోడు, వాచ్‌ను స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మహిళ పుష్పలతగా గుర్తించారు. గన్నవరం రాంనగర్‌కు చెందిన ఆమె.. మేథా టవర్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. శనివారం సాయంత్రం ఫ్రెండ్‌ని కలిసివస్తానంటూ ఇంటి నుంచి వెళ్లిన పుష్పలత.. శవమై కనిపించడం చర్చనీయాంశమైంది.
పుష్పలత పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు శనివారపు పేటకి చెందిన అనిల్‌కుమార్‌ను ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో.. ఆమె భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పుష్పలత మృతికి కారణం భార్యభర్తలు మధ్య మనస్పర్థలా? లేక మరేమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.