Andhra Pradesh: అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు.. ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Oct 07, 2021 | 7:43 AM

Andhra Pradesh: అనంతపురం జిల్లాలోని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.

Andhra Pradesh: అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు.. ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం..
Accident

Follow us on

Andhra Pradesh: అనంతపురం జిల్లాలోని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును మరో వాహనం వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా దెబ్బతినగా.. ప్రమాదానికి కారణమైన కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్లి వస్తున్నారు.

ఈ క్రమంలో అనంతపురం పట్టణ శివారులో తాను ప్రయాణిస్తున్న కారును మరో కారు వేగంగా వచ్చి వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే వాహనం స్వల్పంగా దెబ్బతిన్నది. ఢీకొన్న కారు ముందు భాగం మాత్రం నుజ్జు నుజ్జుగా మారింది. అయితే, ఈ ఘటనలో ఎమ్మెల్యేకి ఎలాంటి గాయాలు అవకపోవడంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్యే పద్మావతి సురక్షితంగా ఉన్నారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. కాగా, ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎమ్మెల్యే కారును ఢీకొన్ని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Narendra Modi: నరేంద్రుడి ప్రజా ప్రస్థానానికి 20 ఏళ్లు.. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు..

Chanakya Niti: ఇలాంటి వ్యక్తులతో అస్సలు స్నేహం చేయవద్దు.. చేస్తే ఇక అంతే..

Sherlyn Chopra: పార్టీల్లో స్టార్ హీరోల భార్యలు డ్రగ్స్ తీసుకుంటారు.. స్వయంగా చూసి షాకయ్యాను.. షెర్లిన్ చోప్రా సంచలన కామెంట్స్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu