Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Musi River: పదేళ్ల క్రితం తండ్రి.. ఇప్పుడు కొడుకు.. మూసీలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం..

Musi River Hyderabad: మూసీ నదిలో గల్లంతైన జహంగీర్ కోసం రెండోరోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఓల్డ్‌మలక్‌పేట శంకర్ నగర్ వద్ద మూసీనదిలో

Musi River: పదేళ్ల క్రితం తండ్రి.. ఇప్పుడు కొడుకు.. మూసీలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం..
Musi River
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 02, 2021 | 11:06 AM

Musi River Hyderabad: మూసీ నదిలో గల్లంతైన జహంగీర్ కోసం రెండోరోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఓల్డ్‌మలక్‌పేట శంకర్ నగర్ వద్ద మూసీనదిలో జహంగీర్ కాలు జారి పడిన సంగతి తెలిసిందే. నిన్నటినుంచి జహంగీర్ కోసం గాలిస్తున్నప్పటికీ.. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగలోకి దిగాయి. ఉదయం నుంచి మూసీనదిలో బొట్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రవాహ ఉధృతి తక్కువగా ఉండటంతో ఈ రోజు ఆచూకీ లభ్యమయ్యే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.

శంకర్ నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ జహంగీర్‌ (35)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జహంగీర్ కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు మూత్ర విసర్జనకు పక్కనే ఉన్న మూసీ నది ఒడ్డుకు వెళ్లాడు. ఈ క్రమంలో కాలు జారి నదిలో పడి కొట్టుకుపోయాడు. కాచిగూడ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే.. జహంగీర్‌ తండ్రి కూడా పదేళ్ల క్రితం మూసీనదిలో పడి గల్లంతయ్యాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. 2011లో కురిసిన వర్షాలకు మూసీ ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో చెత్త వేయడానికి వెళ్లిన జహంగీర్‌ తండ్రి మహ్మద్‌ యూసుఫ్‌ ప్రమాదవశాత్తు మూసీనదిలో పడి గల్లంతయ్యాడు. అప్పుడు కూడా అతని మృతదేహం లభ్యం కాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. అదే తరహాలో అతని కుమారుడు సైతం నదిలో గల్లంతు కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read:

Gold Cheating: వెండి ఉంగరాలకు బంగారు పూత.. హల్ మార్క్ గుర్తు. 200 మంది దగ్గర తాకట్లు.. @6 కోట్లు

Boy Kidnap: 9 నెలల బాలుడి కిడ్నాప్‌.. ఆచూకీ కోసం ఐదు టీమ్‌లు.. తెనాలి వైపు తీసుకెళ్లినట్టు అనుమానం