AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్యాచారానికి గురైన ప్రముఖ నటి.. పరారీలో నిందితుడు

పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటిపై ఓ కార్పోరేట్‌ కంపెనీ సీఈవో అత్యాచారం చేశాడు. అంతేకాదు వీడియో తీసి బెదిరించి, ఆ నటి నుంచి డబ్బులను రాబట్టాడు.

అత్యాచారానికి గురైన ప్రముఖ నటి.. పరారీలో నిందితుడు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 05, 2020 | 9:45 AM

Share

పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటిపై ఓ కార్పొరేట్‌‌ కంపెనీ సీఈవో అత్యాచారం చేశాడు. అంతేకాదు వీడియో తీసి బెదిరించి, ఆ నటి నుంచి డబ్బులను రాబట్టాడు. దీన్ని భరించలేకపోయిన ఆ నటి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులోని జేజే నగర్‌ పరిధిలో ఉంటున్న ఓ నటి(30) తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. 2018లో ఓ కార్పొరేట్‌‌ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తోన్న మోహిత్‌ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే తన కంపెనీకి సదరు హీరోయిన్‌ని అంబాసిడర్‌గా నియమించాడు మోహిత్‌. ఇక కంపెనీ ప్రచారం నిమిత్తం ఆ నటిని పలు ప్రదేశాలకు తీసుకెళ్లాడు. గతేడాది జూన్‌ 22న  మోహిత్‌ పుట్టినరోజు కాగా తన ఇంట్లోనే పార్టీని ఇచ్చాడు. ఆ తరువాతి రోజు ఆమె పుట్టినరోజు కాగా.. ఇద్దరు కలిసి ఏకాంతంగా పార్టీ చేసుకున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న మోహిత్.. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెకు తాగించాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారం చేశాడు. ఆ తతంగాన్నంతా సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు.

వాటితో నటిని బ్లాక్‌మెయిల్ చేస్తూ సుమారు రూ.20లక్షల వరకు దోచుకున్నాడు.  దీంతో తనకు సాయం చేస్తారన్న ఆశతో బాధితురాలు ఆ విషయాన్ని మోహిత్‌ తల్లిదండ్రులకు చెప్పింది. అయితే వారు కూడా బెదిరింపులకు దిగారు. దీంతో విసిగిపోయిన నటి మోహిత్‌తో పాటు అతడి తల్లిదండ్రులు మహాదేవ్, నాగవేణి, బంధువు రాహుల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఈ విషయం తెలిసి మోహిత్‌ పరారీ అవ్వగా.. అతడి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే నిందితుడి కుటుంబసభ్యులను విచారిస్తామని పోలీసులు తెలిపారు.

Follow Us
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!