AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళ ఏకాంత ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. లైంగికదాడికి పాల్పడ్డ జూబ్లీహిల్స్ సీఐపై కేసు!

హైదరాబాద్ మహానగరం జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులురెడ్డిపై అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో లైంగిక దాడి కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, ఆమె స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసులురెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

మహిళ ఏకాంత ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. లైంగికదాడికి పాల్పడ్డ జూబ్లీహిల్స్ సీఐపై కేసు!
Jubileehills Ci Srinivasulu Reddy
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Aug 08, 2026 | 7:06 AM

Share

హైదరాబాద్ మహానగరం జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులురెడ్డిపై అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో లైంగిక దాడి కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, ఆమె స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసులురెడ్డిపై BNSలోని 68, 64(2)(a)(m), 89, 74, 75, 77, 78, 115(2), 308, 351(3)తో పాటు ఐటీ యాక్ట్‌లోని 66(E), 67, 67(A) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

శ్రీనివాసులు రెడ్డి తనను లొంగదీసుకుని శారీరకంగా వాడుకున్నారని, అనంతరం బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. తనకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించి వాటిని అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొంతకాలం తనతో సహజీవనం చేసిన ఆయన, ఆ తర్వాత తనను వదిలించుకునేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించింది.

ఈ ఫిర్యాదుపై అధికారులు చేపట్టిన విచారణలో శ్రీనివాసులురెడ్డి కొంతకాలం బాధితురాలితో ఒకే ఇంట్లో ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అలాగే ఆమెను దూరం చేసుకునేందుకు ప్రయత్నించినట్లు కూడా విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సీఐ శ్రీనివాసులురెడ్డిని ఉన్నతాధికారి సజ్జనార్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రేప్ కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులురెడ్డిపై లైంగిక దాడి కేసు!`
జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులురెడ్డిపై లైంగిక దాడి కేసు!`
తలనొప్పి వచ్చినప్పుడు టీ, కాఫీ తాగితే ఏమవుతుంది?
తలనొప్పి వచ్చినప్పుడు టీ, కాఫీ తాగితే ఏమవుతుంది?
టూ వీలర్ కొనాలనుకుంటున్నారా? ఈ వివరాలు తెలియకపోతే నష్టపోతారు
టూ వీలర్ కొనాలనుకుంటున్నారా? ఈ వివరాలు తెలియకపోతే నష్టపోతారు
మక్కాలో మహా కూటమి.. సౌదీ, టర్కీ, పాక్ భారీ రక్షణ ఒప్పందం
మక్కాలో మహా కూటమి.. సౌదీ, టర్కీ, పాక్ భారీ రక్షణ ఒప్పందం
పర్ఫెక్ట్ మిల్క్‌టీ కోసం పాలు ఎప్పుడు కలపాలి? ముందా.. తర్వాతా?
పర్ఫెక్ట్ మిల్క్‌టీ కోసం పాలు ఎప్పుడు కలపాలి? ముందా.. తర్వాతా?
సోనెట్, సెల్టోస్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులు.. ఎన్ని లక్షలో తెలుసా
సోనెట్, సెల్టోస్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులు.. ఎన్ని లక్షలో తెలుసా
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్
మెరుగైన బ్రేకింగ్‌తో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్ ప్రత్యేకతలు ఇవే
మెరుగైన బ్రేకింగ్‌తో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్ ప్రత్యేకతలు ఇవే
కార్లపై భారీ తగ్గింపులు ప్రకటించిన టాటా.. ఎన్ని లక్షలంటే
కార్లపై భారీ తగ్గింపులు ప్రకటించిన టాటా.. ఎన్ని లక్షలంటే
అందుకే బూతు సినిమాల్లో నటించా.. అసలు విషయం చెప్పిన ప్రముఖ నటి
అందుకే బూతు సినిమాల్లో నటించా.. అసలు విషయం చెప్పిన ప్రముఖ నటి