AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. భగ్గుమన్న బంగారం, వెండి ధరలు..!

Gold, Silver Rates: గోల్డ్ రేట్లు ఒక్కసారిగా పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగి ఔన్స్‌కు 4,300 డాలర్ల స్థాయిని దాటాయి. ఈ వారం మొత్తంగా చూసుకుంటే బంగారం ధరలు 6 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి..

Subhash Goud
|

Updated on: Aug 08, 2026 | 10:35 AM

Share
 Gold, Silver Rates: పండుగ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి ఆకాశాన్నంటుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలోనే బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తుండగా, ప్రస్తుతం పరిస్థితిని చూస్తుంటే రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే అవకాశం నిజమేనని అనిపిస్తోంది. బంగారం, వెండి ధరలలో నిరంతర హెచ్చుతగ్గుల కారణంగా మార్కెట్ నిశ్శబ్దంగా ఉంది. అయితే, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో దుకాణదారులకు అడపాదడపా ఆర్డర్లు రావడం ప్రారంభమైంది.

1 / 6
 శనివారం (ఆగస్టు 8) ఉదయం 10 గంటల సమయానికి మార్కెట్‌లో బంగారం జోరు కొనసాగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1090 పెరిగింది. మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,350గా ఉంది. గత వారం అంటే ఆగస్ట్‌ 1వ తేదీన దీని ధర 10 గ్రాములకు రూ.1,44,370గా ఉంది. దీంతో ఈ వారంలో  10 గ్రాములకు రూ.8,130 పెరుగుదల నమోదైంది.

2 / 6
 ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికొస్తే ప్రస్తుతం దీని ధర రూ.1,39,650 ఉంది. గత వారం ఇదే రోజున మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,220గా ఉంది. గత వారంతో పోలిస్తే ఇది 10 గ్రాములకు రూ.7,430 వరకు పెరుగుదలను సూచిస్తుంది.

3 / 6
 ఇక వెండి ధర విషయానికొస్తే ఈ లోహం కూడా పరుగులు పెడుతోంది. దీని ధర గతవారం కిలోకు 2,35,000 రూపాయలు ఉండగాని ప్రస్తతం వార్త రాసే సమయానికి 2,45,000 వద్ద ట్రేడవుతోంది. అంటే ఈ వారంలో 10 వేల రూపాయల వరకు పెరిగిందని గమనించవచ్చు.

4 / 6
 మరోవైపు అమెరికా ఉద్యోగాల నివేదిక బలహీనంగా వస్తే ఆర్థిక మాంద్యం భయాలు పెరిగే అవకాశం ఉందని గమనించాలి. అప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులైన బంగారం వైపు మరింతగా ఆకర్షితులవుతారు. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు మరింత పెరిగి 4,380 డాలర్ల స్థాయిని చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

5 / 6
 గోల్డ్ రేట్లు ఒక్కసారిగా పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగి ఔన్స్‌కు 4,300 డాలర్ల స్థాయిని దాటాయి. ఈ వారం మొత్తంగా చూసుకుంటే బంగారం ధరలు 6 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి తర్వాత ఒక వారంలో నమోదైన అతిపెద్ద పెరుగుదల ఇదే కావడం గమనార్హం.

6 / 6
Follow Us