AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill: సీరియస్ మూడ్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. గిల్ గాయంపై కొనసాగుతున్న సస్పెన్స్

Shubman Gill: శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వేలి గాయం కారణంగా వార్మప్ మ్యాచ్‌లో ఫీల్డింగ్, బ్యాటింగ్‌కు దూరమయ్యాడు. గిల్ గాయం తీవ్రతపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయకపోవడంతో, గౌతమ్ గంభీర్ అత్యవసర సమావేశం ఉత్కంఠను మరింత పెంచింది.

Shubman Gill: సీరియస్ మూడ్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. గిల్ గాయంపై కొనసాగుతున్న సస్పెన్స్
Shubman Gill
Rakesh
|

Updated on: Aug 08, 2026 | 11:55 AM

Share

Shubman Gill: శ్రీలంకతో జరగబోయే కీలక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. శ్రీలంక ప్రెసిడెంట్స్ XI జట్టుతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వేలి గాయం కారణంగా మొదటి రోజు ఫీల్డింగ్‌కు దూరమయ్యాడు. మ్యాచ్ రెండో రోజున శ్రీలంక ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన అనంతరం భారత ఇన్నింగ్స్ ప్రారంభం కాగా, గిల్ ఓపెనింగ్‌కు రాలేకపోయాడు. గిల్ స్థానంలో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు దిగారు. గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

గౌతమ్ గంభీర్ అత్యవసర సమావేశం

ప్రాక్టీస్ సెషన్ సమయంలో గిల్ వేలికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. మొదటి రోజు ఆట ముగిసిన అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మెడికల్ స్టాఫ్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందు సాధారణంగా ఉన్న గంభీర్, మీటింగ్ ముగిసి బయటకు వచ్చేటప్పుడు తీవ్ర ఆందోళనగా కనిపిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే బీసీసీఐ గిల్ గాయం తీవ్రతపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం విశేషం.

368 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్ డిక్లేర్

తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక XI జట్టు 8 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించకుండానే శ్రీలంక జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మొదటి రోజు శ్రీలంక బ్యాటర్లు భారత బౌలర్లను తీవ్రంగా శ్రమపెట్టారు. ఒక దశలో 171 పరుగుల వరకు భారత్ కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగింది. అయితే చివరి సెషన్‌లో భారత బౌలర్లు పుంజుకుని వరుస వికెట్లు పడగొట్టారు.

కలవరపెడుతున్న గిల్ గాయాలు

ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గిల్ మాట్లాడుతూ.. ఆటగాళ్లు తరచూ గాయపడితే 2027 వరల్డ్ కప్ వంటి పెద్ద టోర్నీల్లో ఎలా ఆడతారని ప్రశ్నించారు. కానీ, స్వయంగా గిల్ కూడా తరచూ గాయాల బారిన పడుతుండటం భారత యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిన గిల్, ఐపీఎల్ 2026లోనూ మెడ నొప్పితో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు సిరీస్ ప్రారంభ సమయానికి వేలి గాయం కావడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జీవితం మీద నిరాశ కలిగితే స్మశానానికి వెళ్లి కూర్చుంటా..
జీవితం మీద నిరాశ కలిగితే స్మశానానికి వెళ్లి కూర్చుంటా..
గిల్‌కు ఏమైంది? అత్యవసర సమావేశం తర్వాత ఆందోళనలో గంభీర్
గిల్‌కు ఏమైంది? అత్యవసర సమావేశం తర్వాత ఆందోళనలో గంభీర్
అధికారుల కళ్లగప్పి తప్పించుకున్న పెద్దపులి..!
అధికారుల కళ్లగప్పి తప్పించుకున్న పెద్దపులి..!
పొట్ట కొవ్వు కరిగించి, బరువును తగ్గించే సూపర్ డ్రింక్..
పొట్ట కొవ్వు కరిగించి, బరువును తగ్గించే సూపర్ డ్రింక్..
మీ బట్టలు తెల్లగా మెరవాలా? వాషింగ్‌ మెషిన్‌లో పారాసెటమాల్‌ వేయండి
మీ బట్టలు తెల్లగా మెరవాలా? వాషింగ్‌ మెషిన్‌లో పారాసెటమాల్‌ వేయండి
రూ.340 చెల్లిస్తే చాలు నెల మొత్తం ఎన్ని సార్లు అయినా తిరగొచ్చు..!
రూ.340 చెల్లిస్తే చాలు నెల మొత్తం ఎన్ని సార్లు అయినా తిరగొచ్చు..!
Gen Z ఆలోచనతో మారనున్న భారత ఆర్థిక వ్యవస్థ..!
Gen Z ఆలోచనతో మారనున్న భారత ఆర్థిక వ్యవస్థ..!
వరి, మొక్కజొన్నకు యూరియా వేస్తున్నారా.. ఈ తప్పులు చేస్తే దిగుబడి
వరి, మొక్కజొన్నకు యూరియా వేస్తున్నారా.. ఈ తప్పులు చేస్తే దిగుబడి
నిమ్మకాయలు ఎండిపోయి,పాడవకుండా నెల రోజుల పాటు తాజాగా ఉంచే చిట్కాలు
నిమ్మకాయలు ఎండిపోయి,పాడవకుండా నెల రోజుల పాటు తాజాగా ఉంచే చిట్కాలు
నక్షత్ర మార్పు.. ఈ రాశుల వారికి తిరుగులేని విజయాలు
నక్షత్ర మార్పు.. ఈ రాశుల వారికి తిరుగులేని విజయాలు