Andhra News: ఇంట్లోకి వచ్చివెళ్లిన ముగ్గురు వ్యక్తులు.. కాసేపటికే వెలుగు చూసిన దారుణం.. అసలు ఏం జరిగింది!
గుంటూరు జిల్లా తెనాలిలో పట్టపగలే దారుణం వెలుగు చూసింది. ఒ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు ఇంట్లోని ఇద్దరు వృద్ద మహిళలను దారుణంగా హత్య చేసి వారి ఒంటిపై ఉన్న నగలను ఎత్తుకొని వెళ్లిపోయారు. ఎవరీకి అనుమానం రాకుండా ఇద్దరు ఒకరినొకరు కొట్టుకొని చనిపోయినట్టు క్రియేట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెనాలిలోని పరిమి డొంక ప్రాంతం… ఉదయం పదకొండు గంటల సమయంలో దాసరి రాజేశ్వరమ్మ ఇంటి ముందు ఆటో ఆగింది. ఆటోలో నుండి ముగ్గురు వ్యక్తులు దిగారు. వీరిలో ఇద్దరూ పురుషులు కాగా ఒక మహిళ ఉన్నారు. ముందుగా మహిళ రాజేశ్వరి ఇంటి తలుపు తట్టింది. కొద్ది సేపటి తర్వాత రాజేశ్వరి అనే వృద్దురాలు తలుపు తీసింది. ఆమెతో పాటు అంజమ్మ అనే మరో వృద్ద మహిళ కూడా తలుపు వద్దకు వచ్చి ఆ మహళతో మాట్లాడుతుంది. అదే సమయంలో ఇద్దరు పురుషులు ఆ ఇంటిలోకి వెళ్లారు. పది నిమిషాల తర్వాత వచ్చిన ముగ్గురు ఇంటి నుండి బయటకు వచ్చి ఆటోలో వెళ్లిపోయారు.
అయితే కొద్దిసేపటి తర్వాత చెన్నైలో ఉన్న కుమార్తె ఫోన్ చేయగా వృద్ద మహిళలు ఫోన్ తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె వెంటనే బంధువులకు చెప్పి ఆ ఇంటికి వద్దకు పంపించింది. బంధువులు వెళ్లి చూడగా ఇద్దరూ వృద్దురాల్లు చనిపోనిపోయి పడి ఉన్నారు. ఒకరి చేతిలో కర్ర ఉండగా మరొకరి చేతిలో బరువు తూచే రాయి ఉంది. దీంతో వెంటనే బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరించారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాలను చెక్ చేశారు. ఆ సీసీ కెమెరాల ఫుటేజ్‌లో లో ముగ్గురు వ్యక్తులు ఇంటికి వచ్చినట్లు గుర్తించారు.
అయితే, ఆ ఇద్దరి మృతదేహాలపై ఉన్న నగలు కూడా కనిపించ లేదు. దీంతో బంగారం కోసమే ఎవరైనా వీరిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వృద్ద మహిళలు ఒంటరిగా ఉండటాన్ని గమనించి వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా నిర్థారించారు. హత్య చేసిన తర్వాత ఎలాంటి అనుమానం రాకుండా వారిలో వారే కొట్టుకొని చనిపోయినట్లు నిందితులు ఇలా వాళ్ల చేతితో కర్ర, రాయి పెట్టి ఉంటారని పోలీసులు గ్రహించారు. సిసి కెమెరాల్లో విజువల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.
కొద్దీ రోజుల క్రితం తెనాలి గంగానమ్మ పేటలో కూడా ఒక వృద్ద మహిళను బంగారు ఆభరణాల కోసం చుట్టు పక్కల వ్యక్తులు హత్య చేయడం కలకలం రేపింది. మరోసారి ఇద్దరూ వృద్ద మహిళలు హత్య గురికావడం స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!




