Rahul Murder Case: పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు కోగంటి సత్యం అరెస్టు
Rahul Murder Case: యువ పారిశ్రామికవేత్త, జడ్‌ఎక్స్‌ఇన్ సిలిండర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కరణం రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని..
Rahul Murder Case: యువ పారిశ్రామికవేత్త, జడ్‌ఎక్స్‌ఇన్ సిలిండర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కరణం రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసుల అదుపులో తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఐదుగురి పేర్లను చేర్చారు. ఈ కేసులో కోగంటి సత్యంను పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్న పోలీసులు సత్యంను బెంగళూరులో అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు కోగంటి సత్యం, కోరాడ విజయ్‌కుమార్, ఆయన భార్య పద్మజ, విజయ్‌కుమార్ సన్నిహితురాలు గాయత్రి, ఆమె కుమార్తె పద్మజ ఉన్నారు.
రాహుల్ హత్య కేసులో కోగంటి పాత్రపై ఆధారాలు సేకరించిన పోలీసులు. హత్యకు 3 రోజుల ముందుగానే కోరాడ, కోగంటి సత్యం కాల్‌డేటా సేకరించారు పోలీసులు. రాహుల్‌పై కోరాడను ఉసిగొల్పిన కోగంటి సత్యం.. హత్య కోసం పక్కా ప్లాన్ వేసినట్లు విచారణలో వెల్లడైంది. హత్య ఎలా చేయాలి.. ఎక్కడికి పారిపోవాలి.. ఎలా లొంగిపోవాలో.. అనే అంశాలపై కోగంటి సత్యం ముందస్తుగానే స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనుమానం రాకుండా హత్య జరిగిన రోజు కోగంటి సత్యం విజయవాడలోనే ఉన్నాడు.
అయితే రాహుల్ మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. రాహుల్ ది హైప్రొఫైల్ మర్డర్ గా తెలుస్తోంది. రాహుల్ కంపెనీలపై కన్నేసిన బడా బాబులు తెలివిగా మట్టుబెట్టారా? ప్రస్తుతం తెర ముందుకొచ్చినోళ్లు అసలు సూత్రధారులు కాదా? కుట్రధారులు వేరే ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అసలు, హత్యకు ప్రధాన కారణమెంటి..? ఈ ప్రశ్నలే ఇప్పుడు మిస్టరీగా మారాయి. అసలు, రాహుల్ ను ఎవరు చంపారు? దీని వెనుకున్న అసలు కుట్రదారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? రాహుల్ హత్యకు ప్లాన్ చేసిందెవరు? ఇలా అనేక విషయాలు బయట పడుతున్నాయి.
రాహుల్ మర్డర్ కేసులో మహిళలు ఎందుకొచ్చారనేదే ఇప్పుడు సస్పెన్షన్ గా మారింది. ఈ కేసులో ముగ్గురు మహిళల పేర్లు తెరపైకి వచ్చాయి. పద్మజ, గాయత్రి, పద్మజ. ఈ ముగ్గురిలో ఓ మహిళ రాహుల్ కు 6 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అసలు, ఈ మహిళ అంత పెద్దమొత్తంలో డబ్బు ఎందుకిచ్చింది? రాహుల్ హత్య జరిగినప్పుడు ఈ ముగ్గురు మహిళలు ఘటన స్థలంలోనే ఉన్నారా? అసలు, రాహుల్ హత్యలో మహిళలు కూడా ఉండటం కారణమెంటన్నదానిపై పోలీసులు ఆరా తీస్తు్న్నారు. అయితే మిగతా వారు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
రాహుల్ తండ్రి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా కోరాడ విజయ్ కుమార్, ఏ2గా కోగంటి సత్యం ఉండగా, ఏ3గా కోరాడ విజయ్ భార్య పద్మజ, ఏ4గా గాయత్రి, ఏ5 పద్మజను చేర్చారు. అయితే, ఏ4, ఏ5 గాయత్రి, పద్మజ తల్లీకూతుళ్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మిగతా నిందితులను అదుపులోకి తీసుకుని రహ్యంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.