Cyber Cheating: 30వేల ఫోన్ 3 వేలు.. 50 వేల ల్యాప్‌టాప్ 20 వేలు.. నమ్మితే కొంప కొల్లేరే
30వేల సెల్‌ఫోన్ మూడే మూడు వేలు.. 50 వేల ల్యాప్‌టాప్ 20వేలు మాత్రమే.. 42 ఇంచుల టీవీ జస్ట్ 10వేలకే.. ఇలాంటి మెసేజేస్ మీకు వస్తున్నాయా?....
30వేల సెల్‌ఫోన్ మూడు వేలు.. 50 వేల ల్యాప్‌టాప్ 20వేలు మాత్రమే.. 42 ఇంచుల టీవీ జస్ట్ 10వేలకే.. ఇలాంటి మెసేజేస్ మీకు వస్తున్నాయా? పండుగ పూట సందేశాలు వెల్లువెత్తున్నాయా? అయితే అలాంటి వాటికి మీరు రెస్పాండ్ అవకండి. ఒకవేళ టెంప్ట్ అయి మెసేజ్‌పై క్లిక్ చేస్తే మీ జేబుకి మీరు స్వయంగా చిల్లు పెట్టుకున్నట్టే. యస్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డేస్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ ఆఫర్లతో వల విసురుతున్నారు. మఇంట్లో సరుకులు, ఎలక్ట్రానిక్ గూడ్స్, మొబైల్స్, ల్యాపీలు ఇలా ఏది కావాలన్నా ఈ కామర్స్ సైట్లను ఆశ్రయిస్తున్నారు చాలామంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థలు పండుగల వేళ ఆఫర్లు ఇస్తుంటాయి. అలాంటి వాటిని క్యాష్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు.. మొబైల్, మెయిల్‌కి మెసేజ్‌లు పంపిస్తున్నారు. భారీ ఆఫర్లు.. మంచి అవకాశం మించితే దొరకదంటూ ఊరిస్తున్నారు. భలే మంచి చౌకబేరమంటూ చాలామంది వాటిని నమ్మి మోసపోతున్నారు.
నెట్ బ్యాంకింగ్ మోసాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. 2015-16లో 11 వేల 997 నేరాలు జరిగితే 2016-17లో 25 వేల 800ల పైగానే జరిగాయి. ఇక 2018-19లో ఆ సంఖ్య 50వేలు దాటిపోయింది. ఈ కామర్స్ సంస్థలు ప్రకటించే ఆఫర్లను క్యాష్ చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య స్పిన్ వీల్ పేరుతో కూడా చీటింగ్స్ జరుగుతున్నాయి. మొదట్లో గెలిచావని ఊరిస్తూ ఆటకు అడిక్ట్ చేస్తుంటారు. ఆ తర్వాత రెండు మూడు సార్లు గెలిచారంటూ డబ్బులు కూడా పంపిస్తున్నారు. ఆశతో ఎక్కువ మొత్తంలో డబ్బు పెడుతూ నిండా మునుగుతున్నారు చాలామంది. ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు.
నిజానికి ఆన్‌లైన్ షాపింగ్ చేయాలంటే గూగుల్‌లోకి వెళ్లి సంస్థల పేరు సెర్చ్ చేయాలి. అందులోకి వెళ్లి కావాల్సినవి ఆర్డర్ చేయాలి. అంతేగానీ అపరిచిత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందిస్తే మోసపోవడం ఖాయం. అందుకే అలాంటి వాటికి రెస్పాండ్ కావొద్దంటున్నారు సీసీఎస్ పోలీసులు. పండుగ వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని సజెస్ట్ చేస్తున్నారు.
Also Read: సిద్దార్థ్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన పూనమ్ కౌర్.. తన మార్క్ కామెంట్.. అంతా గందరగోళం
నర్మగర్భంగా మరో పోస్ట్ పెట్టిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్.. నెట్టింట వైరల్