AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

women Sold His Child: భర్తతో విడిపోయిన భార్య.. రెండో పెళ్లి కోసం దారుణం.. 9 నెలల బాబును..

ప్రపంచంలో అన్నింటికంటే గొప్ప ప్రేమ అమ్మ ప్రేమ.. ఈ ప్రేమకు సాటిలేదు.. సాటిరాదు.. కానీ ఓ తల్లి అమ్మ ప్రేమకే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. రెండో పెళ్లి కోసం బిడ్డనే అమ్మేసింది...

women Sold His Child: భర్తతో విడిపోయిన భార్య.. రెండో పెళ్లి కోసం దారుణం.. 9 నెలల బాబును..
Marriage
Srinivas Chekkilla
|

Updated on: Oct 03, 2021 | 2:34 PM

Share

ప్రపంచంలో అన్నింటికంటే గొప్ప ప్రేమ అమ్మ ప్రేమ.. ఈ ప్రేమకు సాటిలేదు.. సాటిరాదు.. కానీ ఓ తల్లి అమ్మ ప్రేమకే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. రెండో పెళ్లి కోసం బిడ్డనే అమ్మాలని చూసింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లాకు చెందిన మణికందన్(38) అనే వ్యక్తికి, జెబామలర్(28) అనే మహిళతో 2019లో వివాహం జరిగింది. వారికి కొద్ద రోజుల తర్వాత కొడుగు పుట్టాడు. పెళ్లైన ఏడాది వరకు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత వారి మధ్య చిన్న చిన్న గొడవలు తలెత్తాయి. ఇంతలో జెబామలర్ బాబుకు జన్మనిచ్చింది. అయినా వారి మధ్య గొడవలు ఆగలేదు. కలిసి ఉండడం ఇష్టం లేక విడాకులు తీసుకుని ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. జెబామలర్ బాబును తీసుకున్ని పుట్టింటికి వెళ్లింది. కూతరు ఇంటి వద్ద ఉంటే ఏ తల్లిదండ్రులకైనా బాధే కాదా.. 28 ఏళ్లకే జెబామలర్ జీవితం ఇలా అయిపోయిందే.. అని ఆమె తల్లిదండ్రులు ఇలానే బాధపడేవారు. ఆమెకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందని భావించిన తల్లిదండ్రులు.. రెండో పెళ్లి చేయాలనుకున్నారు. ఎన్ని సంబంధాలు చూసిన బిడ్డ ఉన్నాడనే కారణంతో ఎవరూ ముందుకు రాలేదు. తన రెండో పెళ్లికి కుమారుడే అడ్డుగా ఉన్నాడని జబామలర్ ఓ ప్లాన్ చేసింది. ఎలాగైనా కుమారుడిని అమ్మేయాలని నిర్ణయించుకుంది.

తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి బ్రోకర్లను సంప్రదించింది. తమ వద్ద బాబు ఉన్నాడని పిల్లలు లేని వారికి తన కుమారుడిని అమ్ముతానని చెప్పింది. బ్రోకర్ల సాయంతో సెల్వమణి, శ్రీదేవి అనే దంపతులకు రూ.3 లక్షలకు 9 నెలల బాబును అమ్మేసింది. కుమారుడిని అమ్మేసిన విషయం తండ్రి మణికందన్‌కు తెలిసింది. అతను వచ్చి జబామలర్‌తో వాగ్వాదానికి దిగాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. వచ్చి నీ కొడుకుని తీసుకెళ్లు అని చెప్పి ఉంటే.. తను వచ్చి తీసుకెళ్లేవాడిని.. కన్న కొడుకును అమ్మేయడానికి మనసెలా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు మణికందన్‌. చివరకు పోలీసులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని తండ్రికి అప్పగించారు. బాబును కొనుగోలు చేసిన దంపతులతో పాటు బ్రోకర్లను అరెస్టు చేశారు. పోలీసులు వస్తున్నారని తెలిసి జెబామలర్, ఆమె తల్లిదండ్రులు పారిపోయారు. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.

Read Also.. Haryana Gang: ఏటీఎంలో చోరీలకు పాల్పడుతున్న హర్యానా గ్యాంగ్‌.. కూపీలాగుతున్న పోలీసులు..