AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో రూ.1.20 విలువైప గంజాయి పట్టివేత

అక్రమార్కులకు ఎన్ని అడ్డుకట్టలు వేసిన ప్రయోజనం లేకుండాపోతుంది. రోజుకో కొత్త మార్గం చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఏపీలో రూ.1.20 విలువైప గంజాయి పట్టివేత
Balaraju Goud
|

Updated on: Sep 16, 2020 | 6:39 PM

Share

అక్రమార్కులకు ఎన్ని అడ్డుకట్టలు వేసిన ప్రయోజనం లేకుండాపోతుంది. రోజుకో కొత్త మార్గం చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరకు నుంచి ఒడిశా రాష్ట్రం రాయఘడ్ కు అక్రమంగా తరలిపోతున్న గంజాయిని కొమరాడ పోలీసులు పట్టుకున్నారు. కొమరాడ వద్ద రహదారి గోతుల కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవటంతో అనుమానాస్పదస్థితిలో ఓ లారీని పోలీసులు గుర్తించారు. దీంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు భారీగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. సుమారు రూ. కోటి 20 లక్షల రూపాయల విలువ చేసే 675 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Follow Us