భర్తను చంపిన న్యాయవాదికి జీవితఖైదు
తప్పు చేసినవారు ఎంతటివారైనా తప్పించుకోలేరు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచటన తీర్పు వెలువరించింది. భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు విధించింది. కోల్‌కత్తాకు చెందిన ఓ మహిళా న్యాయవాదికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు.

తన భర్త రజత్ డేని మొబైల్ ఫోన్ ఛార్జర్‌తో గొంతు కోసి చంపిన కేసులో లాయర్ అనిండితా పాల్కు పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగనాస్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. తన భర్త హత్య కేసులో సోమవారం ఆమెను దోషిగా తేల్చిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి సుజిత్ కుమార్ ఆమెకు జీవిత ఖైదు తోపాటు రూ.10,000 జరిమానా విధించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యం అదృశ్యం కావడానికి కారణంగా భావించిన కోర్టు ఆమెను దోషిగా తేలింది. ఇందు కోసం ఆమెకు అదనంగా మరో సంవత్సరం జైలు శిక్ష విధించింది. రెండు తీర్పులు ఏకకాలంలో విధించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
కోల్‌కతా సమీపంలోని న్యూ టౌన్ ఫ్లాట్‌లో 2018 నవంబర్ 24న అర్థరాత్రి తన భర్త రజత్ డేని మొబైల్ ఫోన్ ఛార్జర్‌తో గొంతు కోసి అనిండితా పాల్కు చంపినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెను విచారించిన పోలీసులు నవంబర్ 29న అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ, వాదనలు ఈ ఏడాది మార్చిలో పూర్తయ్యాయి. అప్పటి నుంచి తీర్పు రిజర్వ్ లో ఫాస్ట్ కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది.