సుశాంత్ కేసు: ఎన్సీబీ అధికారికి కరోనా పాజిటివ్
బాలీవుడ్ హీరో సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణాన్ని విచారిస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారుల్లోని ఒకరికి కరోనా సోకింది.
బాలీవుడ్ హీరో సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణాన్ని విచారిస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారుల్లోని ఒకరికి కరోనా సోకింది. దీంతో బుధవారం విచారణను తొందరగా కంప్లీట్ చేశారు. విచారణలో భాగంగా సుశాంత్ మాజీ మేనేజర్ శ్రుతి మోదీని కేవలం గంటసేపు మాత్రమే ప్రశ్నించి పంపించేశారు. ఈ మేరకు ఎన్సీబీ ప్రకటన విడుదల చేసింది.
“సుశాంత్ కేసును డ్రగ్స్ కోణంలో విచారిస్తున్న మా టీమ్ లోని ఓ సభ్యునికి కరోనా సోకింది. యాంటిజెన్ పరీక్షలో ఈ విషయం నిర్దారణ అయ్యింది. మిగిలిన అధికారులకు పరీక్షలు చేయిస్తున్నాం. అధికారులు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందుకోసమే ఈ రోజు విచారణకు హాజరైన శ్రుతి మోదీని తిరిగి పంపించేశాం” అని ఎన్సీబీ పేర్కొంది
One of the members of SIT has tested positive for #COVID19. We just received antigen test report. In view of that, other members will be tested & protocol will be followed. Accordingly, we’ve sent back Shruti Modi who had joined investigation today: Narcotics Control Bureau (NCB) https://t.co/pl0bXSpDcw pic.twitter.com/XIM2AcsSjW
— ANI (@ANI) September 16, 2020