నీరవ్ మోదీకి కస్టడీ పొడిగింపు

పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)ని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 19 వరకు మరోసారి పొడిగించింది లండన్ వెస్ట్ మినిస్టర్స్ కోర్టు. రూ.13 వేల కోట్లకు పైగా పీఎన్‌బీని మోసం చేసి లండన్ వెళ్లిపోయాడు నీరవ్ మోదీ. ప్రస్తుతం నీరవ్‌ మోదీ ఆగ్నేయ లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తుండగా జైలు నుంచి వీడియో లింక్‌ ద్వారా అతడిని న్యాయస్థానం విచారించింది. నీరవ్‌ మోదీకి […]

నీరవ్ మోదీకి కస్టడీ పొడిగింపు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 23, 2019 | 1:45 AM

పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)ని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 19 వరకు మరోసారి పొడిగించింది లండన్ వెస్ట్ మినిస్టర్స్ కోర్టు. రూ.13 వేల కోట్లకు పైగా పీఎన్‌బీని మోసం చేసి లండన్ వెళ్లిపోయాడు నీరవ్ మోదీ. ప్రస్తుతం నీరవ్‌ మోదీ ఆగ్నేయ లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తుండగా జైలు నుంచి వీడియో లింక్‌ ద్వారా అతడిని న్యాయస్థానం విచారించింది. నీరవ్‌ మోదీకి సెప్టెంబర్‌ 19 వరకు జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగిస్తూ తీర్పు వెలువరించారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసినట్టు గత ఏడాది జనవరిలో వెలుగులోకి వచ్చింది. దీంతో నీరవ్ మోదీ, అతని మేనమామ మొహుల్ చోక్సీతో సహా కలిసి విదేశాలకు పారిపోయారు. వీరిద్దరిలో నీరవ్‌ను ఈ ఏడాది మార్చి 19న స్కాట్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే నీరవ్‌ను భారత్ రప్పించేందుకు సీబీఐ, ఈడీ సంస్ధలు ప్రయత్నాలు చేసినా అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.