బెంగళూరు ఘటన.. ఐదుగురి అరెస్ట్
బెంగళూరులో సోమవారం సంచలనం సృష్టించిన మర్డర్ కేసులో పోలీసులు ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుల బాధలు భరించలేక సురేశ్ అనే వ్యక్తి తన 12ఏళ్ల కుమారుడిని ఉరేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన భార్య గీతాభాయి కూడా ఆత్మహత్య చేసుకొని కన్నుమూసింది. ఇక ఈ కేసును విచారిస్తున్న పోలీసులు తాజాగా ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇటీవల చీటీల వ్యాపారంలో నష్టాలు రావడంతో.. తమ డబ్బును వడ్డీతో సహా ఇవ్వాలంటూ రమేశ్ కుటుంబంపై కొందరు ఒత్తిడి […]
బెంగళూరులో సోమవారం సంచలనం సృష్టించిన మర్డర్ కేసులో పోలీసులు ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుల బాధలు భరించలేక సురేశ్ అనే వ్యక్తి తన 12ఏళ్ల కుమారుడిని ఉరేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన భార్య గీతాభాయి కూడా ఆత్మహత్య చేసుకొని కన్నుమూసింది. ఇక ఈ కేసును విచారిస్తున్న పోలీసులు తాజాగా ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఇటీవల చీటీల వ్యాపారంలో నష్టాలు రావడంతో.. తమ డబ్బును వడ్డీతో సహా ఇవ్వాలంటూ రమేశ్ కుటుంబంపై కొందరు ఒత్తిడి తీసుకొచ్చారు. వారిలో ఇంటిపక్కల వారు కూడా ఉన్నారు. వారి చర్య వలనే ఆత్మహత్య చేసుకోవాలని రమేశ్ కుటుంబం భావించిందని పోలీసులు నిర్దారణకు వచ్చారు. దీంతో ఐదు మందిని అరెస్ట్ చేశారు. దీనిపై స్థానిక పోలీస్ అధికారి అబ్దుల్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం. మరో ఇద్దరు, ముగ్గురిని త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ పేర్కొన్నారు. కాగా ఇదే కేసులో ఓ జర్నలిస్ట్‌పై పోలీసులు కేసు నమోదు చేశాయి. గీతాభాయి అంత్యక్రియల సమయంలో రమేశ్ బాబు ఫోన్‌ను తీసుకున్న జర్నలిస్ట్.. అందులో కొన్ని వీడియోలను పలువురికి షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో అతడిపై కూడా కేసు నమోదైంది.