కొడుక్కి ఉరేసిన కసాయి తండ్రి.. వీడియో తీసిన కూతురు

అప్పుల బాధలు భరించలేక ఓ వ్యక్తి తన కుమారుడికి ఉరి వేసి చంపేశాడు. అది భరించలేక అతడి భార్య ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు విబుతీనగర్‌లో ఈ దారుణ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం సురేశ్ బాబు(43) అనే వ్యక్తి సేల్స్ ఎగ్జిగ్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య గీతాభాయి ఇంటి దగ్గరే ఓ కిరాణా షాపును పెట్టుకొని చిట్టీ వ్యాపారం నడుపుతోంది. వీరికి 17ఏళ్ల కుమార్తెతో పాటు వరుణ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఇటీవల […]

కొడుక్కి ఉరేసిన కసాయి తండ్రి.. వీడియో తీసిన కూతురు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 03, 2019 | 3:29 PM

అప్పుల బాధలు భరించలేక ఓ వ్యక్తి తన కుమారుడికి ఉరి వేసి చంపేశాడు. అది భరించలేక అతడి భార్య ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు విబుతీనగర్‌లో ఈ దారుణ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం సురేశ్ బాబు(43) అనే వ్యక్తి సేల్స్ ఎగ్జిగ్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య గీతాభాయి ఇంటి దగ్గరే ఓ కిరాణా షాపును పెట్టుకొని చిట్టీ వ్యాపారం నడుపుతోంది. వీరికి 17ఏళ్ల కుమార్తెతో పాటు వరుణ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఇటీవల చీటీల లావాదేవీలలో నష్టాలు రావడంతో.. వారికి డబ్బును ఇచ్చిన వారు గీతాబాయిపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని సురేశ్ కుటుంబం నిర్ణయించుకుంది.

ఈ నేపథ్యంలో తొలుత వారి కుమారుడికి ఉరేసి చంపాడు సురేశ్ బాబు. ఈ ఘటనను అతడి కుమార్తె వీడియో తీసింది. ఆ తరువాత గీతా భాయి ఆత్మహత్య చేసుకుంది. కానీ తమ కుమారుడిని చంపేసిన గీతా భాయి.. తరువాత ఆత్మహత్య చేసుకుందని మొదట పోలీసులకు చెప్పాడు సురేశ్. కానీ దర్యాప్తు చేస్తోన్న పోలీసులకు అసలు నిజం తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సురేశ్.. తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని.. కానీ తన కూతురే తనను కాపాడిందంటూ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. మరోవైపు సురేశ్ కూతురి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.