Hyderabad Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. ఫార్మా కంపెనీ ముసుగులో దందా.. NCB సోదాల్లో సంచలనాలు!

హైదరాబాద్‌ టు అమెరికా..డ్రగ్స్‌ దందా..ఎస్‌..హైదరాబాద్‌ కేంద్రంగా మరో మత్తు దందా బయటికొచ్చింది. భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయింది. ఫార్మా కంపెనీ ముసుగులో ఈ డ్రగ్స్‌ దందా నడిపిస్తున్నారు డ్రగ్‌ పెడ్లర్స్‌.

Hyderabad Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. ఫార్మా కంపెనీ ముసుగులో దందా.. NCB సోదాల్లో సంచలనాలు!
Hyderabad Drugs
Follow us
Balaraju Goud

|

Updated on: May 08, 2022 | 12:29 PM

Hyderabad Drugs: హైదరాబాద్‌ టు అమెరికా..డ్రగ్స్‌ దందా..ఎస్‌..హైదరాబాద్‌ కేంద్రంగా మరో మత్తు దందా బయటికొచ్చింది. భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయింది. ఫార్మా కంపెనీ ముసుగులో ఈ డ్రగ్స్‌ దందా నడిపిస్తున్నారు డ్రగ్‌ పెడ్లర్స్‌. ఆన్‌లైన్‌లో ఫార్మా మందులతో పాటు డ్రగ్స్‌ సప్లై చేస్తున్నారు. డ్రగ్స్‌ కింగ్‌పిన్‌ ఆశిష్‌ను అరెస్ట్‌ చేశారు NCB అధికారులు.

జేఆర్‌ ఇన్ఫినిటీ పేరుతో ఫార్మా కంపెనీ నిర్వహిస్తూ..హైదరాబాద్‌ నుంచి అమెరికా సహా విదేశాలకు భారీగా డ్రగ్స్‌ సప్లై చేస్తున్నారు. పక్కా సమాచారంతో డ్రగ్ పెడ్లర్‌ ఆశిష్‌ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్టు గుర్తించారు. ఈ మెయిల్స్‌, ఇంటర్నెట్‌ వాయిస్‌ కాల్స్‌తో డ్రగ్స్‌ దందాకు పాల్పడుతున్నట్టు గుర్తించిన NCB అధికారులు..3.71కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

విదేశాలకు భారీగా డ్రగ్స్‌ సప్లై చేసినట్టు గుర్తించారు NCB అధికారులు. రెండేళ్లలో వెయ్యికి పైగా డ్రగ్స్‌ ఆర్డర్లు అమెరికాకు పంపారు. పక్కా సమాచారంతో దాడులు చేసి ఆశిష్‌ను అరెస్ట్‌ చేసిన అధికారులు..మరింత లోతుగా విచారిస్తున్నారు.