Al Qaeda Chief: మరోసారి భారత్‌పై విషం చిమ్మిన అల్‌ఖైదా అధినేత అమాన్ అల్ జవహిరీ!
ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత అమాన్ అల్ జవహిరీ మరోసారి భారత్‌పై విషం చిమ్మాడు. జవహిరీ కాశ్మీర్‌పై మరో వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
Al Qaeda Chief Ayman al Zawahiri: ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత అమాన్ అల్ జవహిరీ మరోసారి భారత్‌పై విషం చిమ్మాడు. జవహిరీ కాశ్మీర్‌పై మరో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడం ముస్లింల ముఖంపై చెంపదెబ్బ అని ఈ వీడియోలో పేర్కొన్నారు. కర్ణాటక హిజాబ్ వివాదానికి సంబంధించి జవహిరి గతంలో కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత అల్ ఖైదాకు ఐమన్ అల్ జవహిరీ నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ భయంకరమైన ఉగ్రవాది సంస్థను రహస్య ప్రాంతాల నుంచి నిర్వహిస్తున్నాడు.
ఒసామా మరణించి 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగా రికార్డ్ చేసిన వీడియోలో జవహరి కనిపించాడు. ఈ వీడియోలో అమెరికా బలహీనత కారణంగా ఉక్రెయిన్ రష్యా దాడికి బలి అయ్యిందని అల్ జవహారీ విమర్శించాడు. ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ప్రకారం, ఈ 27 నిమిషాల వీడియో శుక్రవారం విడుదలైంది. ఈ వీడియోలో, అల్ ఖైదా చీఫ్ పుస్తకాలు, తుపాకీతో కూర్చొని ఉన్నాడు. ముస్లిం ఐక్యత కోసం పిలుపునిస్తూ, 9/11 తీవ్రవాద దాడుల తర్వాత ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌లో యుద్ధాల ప్రభావాన్ని అల్ జవహారీ US బలహీనంగా పేర్కొన్నాడు.
అంతకుముందు ఏప్రిల్ మొదటి వారంలో, కర్ణాటకలో హిజాబ్ వివాదం సందర్భంగా అల్లా హు అక్బర్ నినాదాన్ని లేవనెత్తిన ముస్కాన్ ఖాన్ అనే అమ్మాయిని అల్ ఖైదా చీఫ్ ప్రశంసిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. జవహిరి వీడియో ప్రభుత్వేతర ఉగ్రవాద వ్యతిరేక సంస్థ SITE ఇంటెలిజెన్స్ ద్వారా ధృవీకరించడం జరిగింది. SITE ఇంటెలిజెన్స్ అందించిన అనువాదంలో, జవహిరి ముస్కాన్ ఖాన్‌ను ప్రశంసించడం కనిపించింది. కర్నాటకలోని కళాశాలల్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రేక్షకుల ముందు ముస్కాన్ నినాదాలు చేశాడు.
జవహిరి ముస్కాన్ కోసం ఒక పద్యం కూడా రాశారు. ఆమెను తన సోదరిగా అభివర్ణించారు. అందులో ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ వీడియోకు ది నోబుల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటూ ఓ కాప్షన్ కూడా ఇచ్చాడు జవహరి. ముస్కాన్ పని గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నానని ఉగ్రవాది జవహిరి చెప్పాడు. దేశంలోని ముస్లింలపై ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఉగ్రవాది జవహిరి ఆరోపించాడు. హిజాబ్ వివాదంపై భారత ముస్లింలు స్పందించాలని ఆయన కోరారు.