తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు…

రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు అధికారులతో మాట్లాడారు. నేరస్తులను పట్టుకుని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలువురు మంత్రులు, అధికారలు సైతం ఈ హత్యను ఖండించారు.  పోలీసుల కేసులో విచారణ ముమ్మరం చేశారు. నిందితుడిని రైతు సురేష్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో […]

తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు...
Ram Naramaneni

| Edited By:

Nov 05, 2019 | 2:29 PM

రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు అధికారులతో మాట్లాడారు. నేరస్తులను పట్టుకుని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలువురు మంత్రులు, అధికారలు సైతం ఈ హత్యను ఖండించారు.  పోలీసుల కేసులో విచారణ ముమ్మరం చేశారు. నిందితుడిని రైతు సురేష్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై మీడియాతో నిందితుడు సురేష్ తల్లిదండ్రులు మాట్లాడారు. తన కొడుక్కి మతిస్థిమితం లేదని సురేష్‌ తండ్రి కృష్ణ అన్నారు. అసలు తహసీల్దార్‌ ఆఫీసుకు ఎందుకు వెళ్లాడో తెలియదన్నారు. తమకు ఉన్న భూమిపై హైకోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. భూమి వ్యవహారం తన కుమారుడు సురేష్‌కు ఏమీ తెలియదని చెప్పారు. ఎవరో కావాలని ఈ పని చేయించి ఉంటారని సురేష్‌ తల్లి పద్మ అనుమానం వ్యక్తం చేశారు.

తహసీల్దార్ కార్యాలయంలోనే ఎమ్మార్వో విజయరెడ్డిపై దుండగుడు పెట్రోలు పోసి నిప్పింటించాడు. తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భోజన విరామ సమయంలో జనం తక్కువ ఉన్నప్పుడు దాడి జరిగింది. ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన అనంతరం.. తను కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. అతడికి 60 శాతం కాలిన గాయాలయ్యాయి.. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విజయారెడ్డి భౌతిక కాయాన్ని ఆమె స్వగ్రామానికి తరలించారు.

ఎమ్మెల్యేకు సంబంధం? విజయారెడ్డి హత్య వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యేకు సంబంధం ఉండొచ్చని కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడని విజయారెడ్డి చెప్పిందన్నారు. ఆమె కాల్ రిజిస్టర్‌ను చెక్ చేస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసు విచారణపై నమ్మకం లేదన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu