కసాయి తల్లి.. కన్నకొడుకునే చంపేసింది.. కారణం తెలిస్తే గుండె పగిలిపోద్ది..
పిల్లలకు కన్నతల్లే అన్నీ.. ఏంకావాలన్నా తల్లినే అడుగుతారు. బిడ్డల కోసం ఎంత కష్టమైన భరిస్తుంది తల్లి. కానీ మహారాష్ట్రలో మాత్రం తల్లి ప్రేమకు మచ్చే తెచ్చే ఘటన చోటుచేసుకుంది. చికెన్ అడిగినందుకు తల్లి కొడుకు పట్ల కర్కషంగా వ్యవహరించింది. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తల్లిని ప్రేమను మించింది ఏది లేదంటారు. కానీ మహారాష్ట్రలో తల్లి ప్రేమకు మచ్చ తెచ్చే అత్యంత దారుణమైన ఘటన జరిగింది. చికెన్ తినాలని కోరిన ఏడేళ్ల కొడుకుపై తల్లి ఆగ్రహంతో ఊగిపోయింది. కళ్లెదురుగా ఉన్న రోలింగ్ పిన్ తీసుకుని విచక్షణారహితంగా కొట్టడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో ఆ బాలుడి అక్కకి కూడా గాయాలయ్యాయి. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాల్ఘర్‌లోని కాశీపాడ ప్రాంతంలో పల్లవి ధుమ్డే తన కుటుంబంతో నివసిస్తోంది. ఆమె కుమారుడు చిన్మయ్ ధుమ్డే చికెన్ తినాలని ఉందని కోరాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన తల్లి రోలింగ్ పిన్‌తో తీవ్రంగా కొట్టింది. దీంతో చిన్మయ్ అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.
అంతటితో ఆగకుండా ఆమె అదే వస్తువుతో తన 10 ఏళ్ల కూతురును కూడా కొట్టింది. గాయపడిన ఆ బాలిక ప్రస్తుతం సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక అరుపులు విన్న పొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితురాలైన పల్లవిని అరెస్టు చేశారు.
“కాశీపాడ ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో నివసించే 40 ఏళ్ల పల్లవి ధుమ్డే, తన కొడుకు చిన్మయ్ గణేష్ ధుమ్డేను రోలింగ్ పిన్‌తో దారుణంగా కొట్టి..చంపిందని ఎస్పీ యతీష్ దేశ్‌ముఖ్ తెలిపారు. ‘‘ఆమె 10 ఏళ్ల కూతురును కూడా కొట్టింది. పాల్ఘర్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. పాల్ఘర్ పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు” అని ఎస్పీ వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




