Telugu Akademi Scam: తెలుగు అకాడమీ స్కామ్‌‌లో కొత్త ట్విస్ట్.. మరో భారీ స్కామ్‌కు ప్రధాన సూత్రధారి స్కెచ్‌!

తెలుగు అకాడమీ స్కామ్‌ గుర్తుంది కదా? ప్రభుత్వాలకు, ఉన్నతాధికారులకు తెలియకుండా వందల కోట్ల రూపాయలు నొక్కేశారు కేటుగాళ్లు.

Telugu Akademi Scam: తెలుగు అకాడమీ స్కామ్‌‌లో కొత్త ట్విస్ట్.. మరో భారీ స్కామ్‌కు ప్రధాన సూత్రధారి స్కెచ్‌!
Telugu Akademi
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 20, 2022 | 5:26 PM

Telugu Akademi Scam: తెలుగు అకాడమీ స్కామ్‌ గుర్తుంది కదా? ప్రభుత్వాలకు, ఉన్నతాధికారులకు తెలియకుండా వందల కోట్ల రూపాయలు నొక్కేశారు కేటుగాళ్లు. అకాడమీ ఉద్యోగులు, బ్యాంకు సిబ్బంది కలిసి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను దారి మళ్లించిన ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన షేక్‌ మస్తాన్‌ వలీ లీలలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు అకాడమీ స్కామ్‌ తరహాలోనే మరో భారీ స్కామ్‌కు స్కెచ్‌ వేసినట్లు పోలీసులు గుర్తించారు.

తెలంగాణ గిడ్డంకుల శాఖకు చెందిన మూడు కోట్ల 98 లక్షల రూపాయలను కార్వాన్‌ యూనియన్‌ బ్యాంక్‌ నుంచి కాజేసే ప్రయత్నం చేశాడు. తెలుగు అకాడమీ FDలతోపాటే గిడ్డంకుల శాఖ FDలను కూడా కాజేసేందుకు ప్లాన్ చేశాడు. అంతలోనే తెలుగు అకాడమీ స్కామ్‌ బయటపడటంతో ఈ ప్లాన్‌ ఫెయిలైంది. దాంతో, గిడ్డంకుల శాఖ FDలు సేఫ్‌ అయినట్లు అధికారులు గుర్తించారు.

తెలుగు అకాడమీ స్కామ్‌ ప్రధాన సూత్రధారి షేక్‌ మస్తాన్‌ వలీపై కార్వాన్‌ యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ గిడ్డంకులశాఖ FDలను కొట్టేసేందుకు ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ సృష్టించారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న మస్తాన్‌ వలీని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు సీసీఎస్ పోలీసులు.

Read Also….  Maharashtra: మాజీ హోంమంత్రికి కోర్టులో చుక్కెదురు.. మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు!