Drugs Mafia: హైదరాబాద్ డ్రగ్స్ సూత్రదారి అరెస్ట్.. ఎంతటివారినైనా విడిచిపెట్టేది లేదని సీపీ స్ట్రాంగ్ వార్నింగ్!
డ్రగ్స్ కేసులో మరో ఇంటర్నేషనల్ స్మగ్లర్ టోనీ.. పోలీసులకు చిక్కాడు. ఇంతటితో అయిపోయిందా... ? లేదు... సినిమా ఇంకా ఉందంటున్నారు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.
Hyderabad Drugs Mafia: డ్రగ్స్ కేసులో మరో ఇంటర్నేషనల్ స్మగ్లర్ టోనీ.. పోలీసులకు చిక్కాడు. ఇంతటితో అయిపోయిందా… ? లేదు… సినిమా ఇంకా ఉందంటున్నారు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్. అతనితో లింకులుంటే.. ఎంతటివారినైనా విడిచిపెట్టేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
టోనీ అలియాస్ చుక్కు ఒక్బానా డేవిడ్. విచ్చలవిడిగా మత్తు దందా చేస్తున్న ఇతను… ఫైనల్‌గా పోలీసులకు దొరికిపోయాడు. నైజీరియాకు చెందిన టోనీ… 2013లో వీసాపై ముంబై వచ్చాడు. వీసా గడువు ముగిసినా.. చట్టవ్యతిరేకంగా అక్కడే ఉంటున్నాడు. ఈస్ట్ అంధేరీలో బట్టల వ్యాపారం పేరిట.. నైజీరియాలో ఉండే మరో ఇంటర్నేషనల్ స్మగ్లర్ స్టార్ బాయ్ నుంచి డ్రగ్స్ తీసుకుని.. దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాడు. గతంలో పోలీసులు జరిపిన దాడుల్లో అనుచరులు దొరికినా.. టోనీ మాత్రం తప్పించుకున్నాడు. వారిచ్చిన వివరాల ఆధారంగా ముంబై వెళ్లిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ టీం.. చాకచక్యంగా టోనీని పట్టుకుంది.
హైదరాబాద్‌లో సంపన్నుల పిల్లల్ని టార్గెట్‌గా చేసుకున్న టోనీ.. డ్రగ్స్ దందా మొదలు పెట్టాడు. మహానగరంలో టోనీతో డ్రగ్స్ దందా చేస్తూ కీలకంగా వ్యవహరిస్తున్న 13 మందిని పోలీసులు గుర్తించారు. వారంతా సంపన్న కుటుంబాలకు చెందినవారేననీ.. 9 మందిని అరెస్టు చేశామనీ హైదరాబాద్ పోలీసు కమిషపర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఈసారి ఎవర్నీ వదిలిపెట్టబోమనీ.. మరోసారి డ్రగ్స్ తీసుకోవాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు. స్టార్ బాయ్, టోనీల మధ్య వ్యవహారం చూస్తే… సినిమాల్లో మాఫియా సీన్లు ఎలా పుట్టుకొ స్తున్నాయో అర్థమవుతోందన్నారు సీవీ ఆనంద్.
హైదరాబాద్‌లో టోనీతో డ్రగ్స్ రిలేషన్ ఉన్నవాళ్లు 300మందికిపైనే ఉన్నారు. ఈసారి ఎవర్నీ వదిలి పెట్టేది లేదని హెచ్చరిస్తున్న పోలీసులు.. ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Read Also… హెచ్చరిక.. కరోనా మందులు ఏ పరిస్థితిలో వాడాలో తెలుసుకోండి.. లేదంటే దుష్పరిణామాలు..?