AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maoist letter: జవాన్‌ను విడిచిపెట్టేందుకు షరతులు.. లేఖ రాసిన మావోయిస్టులు..

దండకారణ్యంలో దాక్కున్న మావోయిస్టులపై దాడికి సిద్ధమవుతున్న ప్రభుత్వాన్ని కన్ఫ్యూజ్ చేసే వ్యూహమా?. లేక నిజంగా ఆత్మరక్షణలో పడ్డారా?. యుద్ధం తర్వాత శాంతి వచనాలు పలుకుతూ లేఖ విడుదల చేశారు. దండకారణ్య ప్రత్యేక జోనల్‌ కమిటీ పేరిట..

Maoist letter: జవాన్‌ను విడిచిపెట్టేందుకు షరతులు.. లేఖ రాసిన మావోయిస్టులు..
Maoist Weapons
Sanjay Kasula
| Edited By: uppula Raju|

Updated on: Apr 06, 2021 | 11:25 PM

Share

దండకారణ్యంలో దాక్కున్న మావోయిస్టులపై దాడికి సిద్ధమవుతున్న ప్రభుత్వాన్ని కన్ఫ్యూజ్ చేసే వ్యూహమా?. లేక నిజంగా ఆత్మరక్షణలో పడ్డారా?. యుద్ధం తర్వాత శాంతి వచనాలు పలుకుతూ లేఖ విడుదల చేశారు. దండకారణ్య ప్రత్యేక జోనల్‌ కమిటీ పేరిట విడుదల చేసిన లేఖలో అనేక అంశాలు ప్రస్తావించారు. తమపైకి రెండు వేల మంది పోలీసులు దాడికి వచ్చారని… కేంద్ర మంత్రి అమిత్‌షా నాయకత్వంలో ఐదు రాష్ట్రాల పోలీసు అధికారులతో భారీ దాడులకు పథకం పన్నారని లేఖలో ఆరోపించారు.

పోలీసుల దాడికి ప్రతిగానే దాడి చేశామని… ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు వెల్లడించారు. మధ్యవర్తి పేరు ప్రకటిస్తే బందీగా ఉన్న రాకేష్వర్ సింగ్‌ను అప్పగిస్తామని.. పేరు ప్రకటించే వరకూ ఆ పోలీసు తమ వద్ద క్షేమంగా ఉంటారని తెలిపారు. మావోయిస్టులకు పోలీసులు శత్రువులు కాదని.. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

చర్చలకు మావోయిస్టులు సిద్ధంగానే ఉన్నారని.. ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. జీరగూడెం వద్ద జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో 14 ఏకే ఫార్టీ సెవన్ తుపాకులు, 2 వేల తూటాలు కొంత మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని మావోయిస్టులు లేఖలో స్పష్టం చేశారు. తమ దగ్గర బంధీగా ఉన్న సీఆర్‌పీఎఫ్ జవాన్ రాకేశ్వర్ సింగ్ క్షేమమంగా ఉన్నాడని మావోయిస్టులు ప్రకటించినా.. పోలీసులు ఈ ప్రకటనను విశ్వసించడం లేదు.

రాకేశ్వర్ సింగ్‌ను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన మావోయిస్టులు.. అతడికి ఏ హాని చెయ్యలేదని లేఖలో పేర్కొన్నారు. PLGAను నిర్మూలించి.. ఏజన్సీ ప్రాంతాల్లో ఉన్న బాక్సైట్‌ను బడా బాబులకు దోచి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు ప్లాన్ చేశారని మావోయిస్టుల కమిటీ ఆరోపించింది.

మావోయిస్టులు రాసిన లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందదో చూడాలి. మావోయిస్టులు లేఖలో పేర్కొన్న అంశాలు కూడా ఎంతరకు నిజం అన్నదానిపై పోలీసుల్లో అనుమానాలు నెలకొన్నాయి. నిజంగా బంధీలను క్షేమంగా ఉంచారా అన్నదానికి రుజువులు కావాలని డిమాండ్ చేస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి: క్రికెటర్ కాకుంటే.. ఉగ్రవాది అయ్యేవాడు.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌మొయిన్ అలీపై తస్లీమా ఫైర్… Thalapathy Vijay Cycles: నటుడు విజయ్ కుమార్‌పై నెటిజన్ల ఫైర్.. వివరణ ఇచ్చుకున్న తలపతి సోషల్ మీడియా సైన్యం

పోలీస్ స్టేషన్‌లో గబ్బర్ సింగ్..! లేడీ పోలీసుతో నాగిన్ డాన్స్..! సోషల్ మీడియాలో రచ్చ..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..!