IPL 2021: క్రికెటర్ కాకుంటే.. ఉగ్రవాది అయ్యేవాడు.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌మొయిన్ అలీపై తస్లీమా ఫైర్…
బంగ్లాదేశ్ రచయిత తస్లీమా నస్రీన్ మరో సారి తన మాటల తూటాలకు పదును పెట్టారు. ఈ సారి తన టార్గెట్‌గా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్, చెన్నైసూపర్ కింగ్స్ ప్లేయర్ మొయిన్ అలీని ఎంచుకున్నారు. తన ట్విటర్ వేదికగా పదునైన మాటలతో కామెంట్స్ పెట్టారు...
బంగ్లాదేశ్ రచయిత తస్లీమా నస్రీన్ మరో సారి తన మాటల తూటాలకు పదును పెట్టారు. ఈ సారి తన టార్గెట్‌గా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్, చెన్నైసూపర్ కింగ్స్ ప్లేయర్ మొయిన్ అలీని ఎంచుకున్నారు. తన ట్విటర్ వేదికగా పదునైన మాటలతో కామెంట్స్ పెట్టారు. మొయిన్ అలీ క్రికెటర్ కాకుంటే.. ఉగ్రవాది అయ్యేవాడని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆమెపై యావత్ క్రికెట్‌లోకం మండిపుతోంది. తస్లీమా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసం కాదని రీ ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా తస్లీమాపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఐపీఎల్ 2021 కోసం కొత్తగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన ఇంగ్లాండ్ ఆటగాడుపై గత వారంలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. జెర్సీపై ఉన్న ఓ మద్యం కంపెనీ లోగోను తన కోసం తీసేయాలని మొయిన్ అలీ టీమ్‌మేనేజ్‌మెంట్ కోరినట్లు తప్పుడు వార్త షికారు చేసింది. అందుకు సీఎస్కే యాజమాన్యం కూడా ఒప్పుకున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తల నేపథ్యంలో మొయన్ అలీపై తస్లీమా నస్రీన్ అతనిపై తనదైన తరహాలో విరుచుకుపడ్డారు. ‘మొయిన్ అలీ క్రికెట్‌లో స్టక్ కాకుంటే.. ఖచ్చితంగా సిరియా వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడు’అంటూ ట్వీట్ చేశారు.
సీఎస్‌కే క్యాంప్‌లో… గత సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఆడిన మొయిన్ అలీ ఈ సీజన్‌లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడబోతున్నాడు. ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ 2021 మినీ వేలానికి ముందు ఆర్‌సీబీ అతన్ని వదిలేసుకోగా.. సీఎస్‌కే రూ.7 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే…