IPL 2021: మరో విజయం కోసం ముంబై ఇండియన్స్ తహతహ.. రోహిత్ సేన బలాలు… బలహీనతలు ఇవే..

ఐపీఎల్ 2021ను కూడా రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకుంటే కనుక హ్యాట్రిక్ టైటిళ్లతోపాటు ఆరుసార్లు కప్పును సొంతం చేసుకున్న జట్టుగా రికార్డులకెక్కుతుంది. దీంతో ఈసారి మరింత పట్టుదలగా ఆడి కప్పుకొట్టాలని కృతనిశ్చయంతో ఉంది. బలమైన టాపార్డర్, మిడిలార్డర్‌తో జట్టు పటిష్టంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా ఆ జట్టుకు అదనపు బలం.

  • Sanjay Kasula
  • Publish Date - 9:22 pm, Tue, 6 April 21
IPL 2021: మరో విజయం కోసం ముంబై ఇండియన్స్ తహతహ.. రోహిత్ సేన బలాలు... బలహీనతలు ఇవే..
Mumbai Indians Team Profile

విక్టరీకి చిరునామాగా నిలుస్తున్న ముంబై ఇండియన్స్.. ఈ సీజన్‌ తన సొంతం చేసుకునేందుకు మంచి ఫ్యూహంతో ఉంది. అద్భుతమైన టాప్ ఆర్డర్‌తో చాలా బలంగా ఉంది ముంబై ఇండియన్స్ జట్టు. ఇందులో రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, పాండ్యా బ్రదర్స్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. ఇలా ప్రస్తుత భారత పరిమిత ఓవర్ల టీమ్‌లో సగం మంది ముంబై ఇండియన్స్ టీమ్‌లోనే ఉన్నారు. వీళ్లకు తోడు షార్ట్ ఫార్మాట్ స్పెషలిస్ట్ కీరన్ పోలార్డ్, సౌతాఫ్రికా డేరింగ్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్.. న్యూజిలాండ్ స్పీడ్‌స్టార్ ట్రెంట్ బౌల్ట్‌లతో ముంబై పర్‌ఫెక్ట్ టీ20 ప్యాకేజీ అనొచ్చు.

సక్సెస్ ఫుల్ జట్టుగా..

అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ముంబై మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టుగా దూసుకుపోతోంది. ఈ ఐపీఎల్‌ను ముంబైను విడదీసి చూడటం చాలా కష్టం. ఎందుకంటే ఈ జట్టు ఏకంగా 5 ట్రోఫీలను కైవసం చేసుకుంది. 2013 నుంచి ఫైనల్‌కు వెళ్లి ప్రతిసారి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. లీగ్‌లో ఎక్కువ మ్యాచ్‌లు.. అంటే 203 మ్యాచులు ఆడి… ఎక్కువ విజయాలు సొంతం చేసుకున్న జట్టుగా నిలిచింది.

ముంబై ఇండియన్స్ ఘన చరిత్ర..

అయితే ఇంత ఘన చరిత్ర ఉన్న ముంబై ఇండియన్స్‌కు ఓ చిన్న మరక ఉంది. అదే ఈ జట్టును వెంటాడుతోంది. గత 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఒక్కసారి కూడా 200+ పరుగుల లక్ష్యాన్ని అధిగమించ లేక పోయింది. చేజింగ్ చేస్తున్న సమయంలో మొత్తం ఏడు సార్లు 200 ప్లస్ పరుగుల టార్గెట్స్‌ను చేజ్ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. ఈ ఏడు సార్లు జట్టు ఓటమిని మూటగట్టుకుంది. లీగ్‌లో ఇంతటి ఘన చరిత్ర ఉన్న ముంబైకి ఇది ఓ మాయని మచ్చలా ఉండిపోయింది.13 ఏళ్ల లీగ్‌ చరిత్రలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్ కింగ్స్(PKS), ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్లు సైతం రెండు వందల పరుగుల లక్షాన్ని అధిగమించాయి. కానీ ఐదు సార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ మాత్రం ఈ టార్గెట్ ఛేజింగ్‌లో మాత్రం కుప్పిగంతులు వేస్తోంది. ఇదొక్కటే ఈ జట్టుకు పెద్ద మైనస్ అని చెప్పాలి.

జట్టు సభ్యులు : రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్ (డబ్ల్యుకె), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), క్రిస్ లిన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, సౌరభ్ తివారీ, ఆదిత్య తారే, కీరోన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, అనుకుల్ రాయ్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ధావల్ కులకర్ణి, మొహ్సిన్ ఖాన్, నాథన్ కౌల్టర్ నైలు, ఆడమ్ మిల్నే, పియూష్ చావ్లా, జేమ్స్ నీషామ్, యుధ్వీర్ చారక్, మార్కో జాన్సెన్, అర్జున్ టెండూల్

బలాలు

కోర్ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్..

ముంబై ఇండియన్స్ గత సీజన్ నుండి తమ మొత్తం ప్లేయింగ్ ఎలెవన్ ను నిలబెట్టుకుంది. అంతేకాకుండా, వారి ప్రారంభ లైనప్‌లో రోహిత్ శర్మ, కీరోన్ పొలార్డ్, జస్‌ప్రీత్ బుమ్రా, క్రునాల్ పాండ్యా మరియు హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్ళు 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి జట్టును అంటిపెట్టుకునే ఉన్నారు. టీమిండియా ఆటగాళ్ళలో వారి బలమైన కోర్ కూడా వీరిని ఐపిఎల్‌లో అత్యంత స్థిరమైన ఆటతీరుతో జట్టులో స్థానం కొనసాగిస్తున్నారు.

మ్యాచ్-విజేతలు

ముంబై ఇండియన్ జట్టుకు విజయాన్ని అందించే ఆటగాళ్లు ఈ జట్టు సొంతం. రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్ ప్రస్తుతం ఐపిఎల్‌లో అత్యంత దూకుడైన ఒపెనర్లుగా పేరుంది. ఇక సూర్యకుమార్ యాదవ్.. విజయం అదించడంలో ముందు వరసలో ఉండే ఆటగాడిగా ఇతనికి పేరుంది. జస్ప్రీత్ బుమ్రా MI కోసం 100 వికెట్లు పడగొట్టిన 3 వ బౌలర్, ఇది నిస్సందేహంగా అతన్ని మ్యాచ్ విజేతగా చేస్తుంది. పొలార్డ్‌తోపాటు పాండ్యా.. మిడిల్ ఆర్డర్ భాగస్వామ్యంలో దూసుకుపోయే జోడీ, చాలా స్థిరంగా ఆడటం వీరి సొంతం. ఏ జట్టులో లేన్ని బలాలు ఈ జట్టు సొంతం.

బలహీనతలు

జస్‌ప్రీత్ బుమ్రా కోసం ఇండియన్ బ్యాకప్

తన గురువు లసిత్ మలింగ నుంచి ముంబై ఇండియన్స్ దాడికి జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు. అతను ఏదైన సమయంలో గాయపడితే, బ్యాకప్ టీమిండియా బౌలర్లు ధావల్ కులకర్ణి, మొహ్సిన్ ఖాన్‌తోపాటు అర్జున్ టెండూల్కర్ ఉన్నారు.

నాణ్యమైన ఫింగర్ స్పిన్నర్ లేకపోవడం…

గత సీజన్లలో రాహుల్ చాహర్ బాగా రాణించాడు. అనుభవజ్ఞులైన పియూష్ చావ్లాను కూడా జట్టులో చేర్చుకున్నారు. కాని జట్టుకు ఫింగర్ స్పిన్నర్ లేక పోవడం పెద్ద మైనస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడ చదవండి: క్రికెటర్ కాకుంటే.. ఉగ్రవాది అయ్యేవాడు.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌మొయిన్ అలీపై తస్లీమా ఫైర్…
CS Somesh Kumar: తెలంగాణ సీఎస్‌ సోమేష్ కుమార్‌కు కోవిడ్ పాజిటివ్.. నిర్దారించిన వైద్యులు..
IPL 2021: ముంబై ఇండియన్‌ అభిమానులకు బ్యాట్ న్యూస్.. కీపింగ్ కన్సల్టంట్ కిరణ్‌ మోరె కరోనా పాజిటివ్..