సార్ మీకు ధన్యవాదాలు.. మీ ప్రోత్సాహం మాకు ఎల్లప్పుడు ఉండాలంటున్న టీమిండియా ప్లేయర్..
Washington Sundar Thanks Anand Mahindra : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్తలలో ఆనంద్ మహీంద్ర ఒకరు. ఓవైపు వేల కోట్ల రూపాయల టర్నోవర్‌తో నడిచే కంపెనీలను నడిపిస్తూనే మరో వైపు సమాజంలో
Washington Sundar Thanks Anand Mahindra : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్తలలో ఆనంద్ మహీంద్ర ఒకరు. ఓవైపు వేల కోట్ల రూపాయల టర్నోవర్‌తో నడిచే కంపెనీలను నడిపిస్తూనే మరో వైపు సమాజంలో జరుగుతోన్న విషయాలపై స్పందిస్తుంటారు ఆనంద్ మహీంద్ర. ముఖ్యంగా సమాజంలో జరిగే మంచి విషయాలు, స్ఫూర్తిదాయక వ్యక్తులను తన సోషల్ మీడియా పోస్టులతో ప్రపంచానికి పరిచయం చేస్తుంటారీ బడా వ్యాపారవేత్త.
ఇటీవల ఆయన ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, శుభ్‌మన్ గిల్, నవ్‌దీప్‌లకు కార్లను బహుమతిగా అందించిన సంగతి తెలిసిందే.. ఇక తమకు బహుమతిగా వచ్చిన కార్లతో ఫొటోలు దిగిన నటరాజన్, శార్దూల్ ఠాకూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా టీమిండియా ప్లేయర్ వాషింగ్ టన్ సుందర్ ఆనంద్ మహీంద్రా పంపించిన వాహనంతో ఫొటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా సర్‌కి ధన్యవాదాలు తెలిపాడు. మా ప్రదర్శన ఎప్పటికి ఇలాగే కొనసాగిస్తామని అన్నాడు. మీరు మా యువతకు అందించే ప్రోత్సాహం, మద్దతు ఇలాగే ఉంటే దేశానికి మరెన్నో పురస్కారాలను తీసుకురావడానికి దోహదం చేస్తుందని అన్నాడు. ఆనంద్ మహీంద్రా సార్ మీకు ధన్యవాదాలు అంటూ ముగించాడు.
View this post on Instagram