- Telugu News Photo Gallery Sports photos Olympic medallist gagan narang and annu raj singh set to marry
Narang set to Marry: ఓ ఇంటివాడు కాబోతున్న స్టార్ షూటర్ గగన్ నారంగ్.. 21న హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్లో వివాహం
భారత స్టార్ షూటర్ గగన్ నారంగ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సహచర షూటర్ అన్నురాజ్ను ఈ నెల 21న వివాహం చేసుకోనున్నాడు.
Updated on: Apr 06, 2021 | 11:18 PM

హైదరాబాద్ స్టార్ షూటర్, ఒలింపిక్ కాంస్య విజేత గగన్ నారంగ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు గెలిచిన ఉత్తర్ ప్రదేశ్ షూటర్ అన్నురాజ్ సింగ్‌తో.. గగన్ పెళ్లి ఈ నెల 21న హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్లో జరగబోతోంది.

వీళ్లిద్దరి వయసూ 37 ఏళ్లే. రెండు దశాబ్దాలుగా షూటింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ అనేక అంతర్జాతీయ టోర్నీల్లో కలిసి పోటీ పడుతున్నారు.

తన తల్లికి అన్ను అంటే చాలా ఇష్టమని, అలాగే అన్ను తల్లిదండ్రులకు తాను నచ్చానని, దీంతో పెళ్లికి మార్గం సుగమమైందని గగన్ తెలిపాడు.

మేం పెళ్లి చేసుకుందామని సరిగ్గా ఎప్పుడు అనుకున్నామో చెప్పలేను. 2002 నుంచి జట్టు సభ్యులుగా ఉన్నాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అన్ని సమయాల్లో ఒకరికొకరు అండగా నిలిచాం. తర్వాత స్నేహితులయ్యాం అంటూ షూటర్ గగన్ నారంగ్ వివరించాడు.




