AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీస్ స్టేషన్‌లో గబ్బర్ సింగ్..! లేడీ పోలీసుతో నాగిన్ డాన్స్..! సోషల్ మీడియాలో రచ్చ..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

POLICE NAGIN DANCE: డాన్సులు వెయ్యడం కామనే.. కానీ ఒడిషాలో ఓ పోలిస్ స్టేషన్‌లోనే పోలీసులు నాగిన్ డాన్స్‌కు స్టెప్పులు వేయడం వివాదాస్పదంగా మారింది.

పోలీస్ స్టేషన్‌లో గబ్బర్ సింగ్..! లేడీ పోలీసుతో నాగిన్ డాన్స్..! సోషల్ మీడియాలో రచ్చ..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Police Dance
Sanjay Kasula
|

Updated on: Apr 06, 2021 | 10:38 PM

Share

సాంస్కృతిక కార్యక్రమాలు.. ప్రత్యేక సందర్బాల్లో పోలీసులు అప్పుడప్పుడూ.. డాన్సులు వెయ్యడం కామనే.. కానీ ఒడిషాలో ఓ పోలిస్ స్టేషన్‌లోనే పోలీసులు నాగిన్ డాన్స్‌కు స్టెప్పులు వేయడం వివాదాస్పదంగా మారింది.

ఒడిషాలోని జైపూర్ జిల్లాలో ఉన్న పనికోయిలి పోలీస్ స్టేషన్‌లో దృశ్యం ఇది. స్టేషన్‌లో పోలీసులంతా రంగులు చల్లుకుని… ఒడియాలో ఓ పాటకు నాగిన్ డాన్స్‌ వేయడం మొదలు పెట్టారు. వీరిలో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. కొంతమంది డాన్సులు వేస్తుంటే.. మిగతా వాళ్లు చప్పట్లు కొడుతూ వాళ్లను ఉత్సాహపరిచారు. అక్కడ ఉన్న పోలీసుల్లో ఒకరు ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

దీంతో ఇది వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో పదే పదే షేర్ అవుతోంది. ఈ సంఘటన హోలీ రోజు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు డాన్సులు చేయడంపై ఎలాంటి అభ్యంతరం లేకున్నా.. సాక్షాత్తూ పోలీస్ స్టేషన్‌లోనే డాన్సులు వేయడం, అది కూడా క్రమశిక్షణను ఉల్లంఘించి మ్యూజిక్ సిస్టమ్‌ పెట్టుకుని చప్పట్లు కొడుతూ.. స్టేషన్‌ను డిస్కో థెక్ మాదిరిగా మార్చడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

గతంలో పోలీసులు కొన్ని ప్రత్యేక సందర్బాల్లో డాన్సులు వేసిన సందర్బాలు ఉన్నాయి. పాసింగ్ ఔట్‌ పరేడ్‌లు, పోలీసులకు ప్రత్యేకంగా పార్టీలు, స్పెషల్ ఆపరేషన్లు సక్సెస్ అయిన తర్వాత జరిగే మీట్‌లలో పోలీసులు డాన్సులు వేసిన సందర్బాలు అనేకం ఉన్నాయి. వీటిని ఉన్నతాధికారులు కూడా ఆమోదించారు.

అయితే ఒడిషాలో జరిగిన సంఘటన విధుల్ని పక్కన పెట్టి పోలీసులు స్టేషన్‌లో చిందులు వేసినట్లు తెలుస్తోంది. ఇదంతా క్రమశిక్షణారాహిత్యం కిందకే వస్తుంది. కాప్స్ డాన్స్ చేస్తున్న సమయంలో బయటి వ్యక్తులు కూడా స్టేషన్‌లోకి రావడం కనిపిస్తోంది. ఈ వీడియోపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు జైపూర్ ఎస్పీ.

ఇవి కూడా చదవండి: క్రికెటర్ కాకుంటే.. ఉగ్రవాది అయ్యేవాడు.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌మొయిన్ అలీపై తస్లీమా ఫైర్… Thalapathy Vijay Cycles: నటుడు విజయ్ కుమార్‌పై నెటిజన్ల ఫైర్.. వివరణ ఇచ్చుకున్న తలపతి సోషల్ మీడియా సైన్యం