కామారెడ్డి జిల్లాలో విషాదం.. భార్య అప్పులు చేసిందని.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ భర్త ఆత్మహత్య

పోసానిపేట గ్రామానికి చెందిన మంగలపల్లి లక్ష్మణ్ గురువారం రోజు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు.

  • Balaraju Goud
  • Publish Date - 9:06 am, Mon, 25 January 21
కామారెడ్డి జిల్లాలో విషాదం.. భార్య అప్పులు చేసిందని.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ భర్త ఆత్మహత్య

Selfie Suicide : ఆర్థిక ఇబ్బందులు తాళలేక మరో వ్యక్తి సెల్పీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోసానిపేట గ్రామానికి చెందిన మంగలపల్లి లక్ష్మణ్ గురువారం రోజు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. అయితే లక్ష్మణ్ భార్య ఇటీవల బీర్షబా సంస్థలో 3 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. ఆ సంస్థ కొద్దిరోజుల క్రితం మూసివేయడంతో అప్పులపాలైన లక్ష్మణ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. డబ్బులు వస్తాయో రావో అని ఆందోళనకు గురయ్యారు.

ఇదిలావుంటే, భార్య పిల్లలతో కలిసి కామారెడ్డిలో నివాసముంటున్న లక్ష్మణ్ గురువారం ఇంటికి వెళ్లివస్తానని పోసానిపేట వెళ్లాడు. అదేరోజు తాను చనిపోతున్నానని భార్యకు వీడియో కాల్ చేసి లైవ్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకొని.. తన చావుకు కారణాలను చెప్పాడుఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్త మరణం తర్వాత బీర్షబా గ్రూపులో భార్య పెట్టిన వాయిస్ రికార్డ్ ఇప్పుడు వైరల్ గా మారింది. మృతుడు లక్ష్మణ్ విద్యుత్ వైరింగ్ పని చేస్తుండగా భార్య జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చావుకు ముందు మృతుడు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Read Also… Family Fight : వనస్థలిపురంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. తల్లీ,కొడుకులను చితకబాదిన బంధువులు..