Family Fight : వనస్థలిపురంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. తల్లీ,కొడుకులను చితకబాదిన బంధువులు..

చైతన్య రెడ్డి ఇంట్లో లేకపోవడంతో అతని సోదరుడు రాజశేఖరరెడ్డి, అతని తల్లి పై దాడి చేసిన ధనలక్ష్మి కుటుంబ సభ్యులు..

Family Fight : వనస్థలిపురంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. తల్లీ,కొడుకులను చితకబాదిన బంధువులు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 25, 2021 | 10:06 AM

ఆ ఫ్యామిలీలో ఉన్నవాళ్లంతా అప్పటి వరకు బాగానే ఉన్నారు. భార్య చిన్నబిడ్డను ఎత్తుకుని ఫోన్‌లో మాట్లాడుతుండగా.. భర్త ఏదో చెప్పబోతూ ఆమె దగ్గరికి వెళ్లాడు. పెద్దకుమారుడు ఇంట్లో సందడి చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నాడు. అంతే… అదే టైంలో ఇంట్లోకి చొరబడ్డ కొందరు.. బీభత్సం సృష్టించారు. వస్తూ.. వస్తూనే ఆ ఇంటి యాజమానిని టార్గెట్‌ చేసుకుని చితకకొట్టడం మొదలు పెట్టారు.

ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ మహానగరంలోని వనస్థలిపురంలో జరిగింది ఈ ఘటన. రెండు కుటుంబాల వివాదం ఇది. కారణాలు ఏవైనా.. ఓ కుటుంబంపై మరో కుటుంబం కక్ష పెంచుకుంది. మొదట ఓ వ్యక్తి లోపలికి ఇంటర్‌ అవుతూనే హెల్మెట్‌ పట్టుకుని కొట్టడం మొదలు పెట్టాడు. అతన్ని ఆపే ప్రయత్నం చేస్తుండగానే పది మంది వరకు వచ్చారు. అదే టైంలో రాజశేఖర్‌రెడ్డి తల్లి వారిని నిలువరించే యత్నం చేసింది. ముసలావిడ అని కూడా చూడకుండా ఆమెపై కూడా చేయి చేసుకున్నారు. దెబ్బలు తాళలేక ఆ తల్లికి కూడా కింద పడిపోయింది.

చైతన్య రెడ్డి అతని భార్య ధనలక్ష్మి కొద్ది రోజుల నుంచి మీర్‌పేట్‌లో నివాసం ఉంటున్నారు. చైతన్య రెడ్డి కొద్ది రోజుల నుండి ఇంటికి రాకపోవడంతో ధనలక్ష్మి కుటుంబ సభ్యులు.. వనస్థలిపురంలో ఉంటున్న చైతన్య రెడ్డి సొంత ఇంటికి బంధువులతో కలిసి వెళ్లారు.. అతని కోసం వాకబు చేసినా సమాచారం దొరకలేదు. దాంతో ధనలక్ష్మి కుటుంబసభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చైతన్య రెడ్డి ఇంట్లో లేకపోవడంతో అతని సోదరుడు రాజశేఖరరెడ్డి, అతని తల్లి పై దాడి చేసిన ధనలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ దాడిలో రాజశేఖర్ రెడ్డితో పాటు అతని తల్లికి గాయాలయ్యాయి. ధనలక్ష్మి కుటుంబ సభ్యుల దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మరోవైపు రాజశేఖర్‌రెడ్డితో పాటు తల్లి తీవ్రంగా గాయపడగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా, గత కొద్ది రోజుల నుండి రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోందని పోలీసులు తెలిపారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, చైతన్యరెడ్డి కుటుంబసభ్యులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నట్లు వెల్లడించారు. రెండు ఫిర్యాదులపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు.

Read Also..  సిరియాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. సైనిక వాహనంపై దాడి.. ముగ్గురు మృతి, 10మందికి గాయాలు