భార్యను అమ్మకానికి పెట్టిన భర్త..ఆన్‌లైన్‌లో ఆఫర్..చివరకు అలా..

కట్టుకున్న భార్యను అమ్మకానికి పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. సామాజిక మాధ్యమాల్లో తన భార్యను అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటించాడు. డబ్బులిస్తే మా ఆవిడ..

భార్యను అమ్మకానికి పెట్టిన భర్త..ఆన్‌లైన్‌లో ఆఫర్..చివరకు అలా..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 04, 2020 | 5:45 PM

మహిళలపై జరుగుతున్న అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆడదాన్ని అంగట్లో సరుకులా అమ్మేస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా కట్టుకున్న భార్యను అమ్మకానికి పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. సామాజిక మాధ్యమాల్లో తన భార్యను అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటించాడు. డబ్బులిస్తే మా ఆవిడ వద్దకు పంపిస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మెహ్‌నగర్ పీఎస్ పరిధి తుథియా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

యూపీలోని మెహ్‌నగర్ పీఎస్ పరిధిలోని తుథియా గ్రామానికి చెందిన పునీత్ అనే వ్యక్తికి కొత్వాలీకి చెందిన మహిళతో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలోనే కట్నంతో పాటు బైక్ ఇస్తానని అత్తింటి వారు మాటిచ్చారు. అయితే, ఏడాది గడిచిపోయినా బైక్ ఇప్పించకపోవడంతో.. భార్యను వేధించటం మొదలుపెట్టాడు పునీత్. ఈ విషయంలో ఇంట్లో నిత్యం గొడవ పడుతూ, ఆమెను తీవ్రంగా కొట్టేవాడు. భర్త వేధింపులు భరించలేక ఇటీవలే భార్య తమ పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తన భార్యను అమ్మేస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమె ఫోటోను, ఫోన్ నంబర్‌ను షేర్ చేశాడు. ఆమె కావాలనుకున్న వారు డబ్బులు చెల్లించాలని, ఆమెతో మాట్లాడటానికి, సమయం గడపటానికి తనను సంప్రదించాలని కోరాడు. దీంతో ఆమెకు చాలా మంది నుంచి ఫోన్లు వస్తున్నాయి. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భర్త పునీత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు