Crime News: కటింగ్ విషయంలో గొడవ.. స్నేహితుడిపై కత్తెరతో దాడి.. మెడపై తీవ్రంగా..
Man attack on Friend: సెలూన్ షాపు వద్ద కటింగ్ విషయంలో జరిగిన గొడవ.. ఓ వ్యక్తిపై కత్తెరతో దాడికి పాల్పడేలా చేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో
Man attack on Friend: సెలూన్ షాపు వద్ద కటింగ్ విషయంలో జరిగిన గొడవ.. ఓ వ్యక్తిపై కత్తెరతో దాడికి పాల్పడేలా చేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో చోటు చేసుకుంది. భవానీ నగర్‌లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంజనేయులు అనే వ్యక్తి.. తన తండ్రితో కలిసి హెయిర్ కటింగ్ కోసం స్థానిక కనకదుర్గమ్మ గుడికి సమీపంలో ఉన్న ఓ సెలూన్‌కు వెళ్లాడు. అయితే.. అక్కడున్న చల్లా శ్రీనివాసరావు కటింగ్ సరిగా చేయించుకోరా అంటూ ఆంజనేయులుకు చెప్పాడు. దీంతో ఆంజనేయులు కొపంతో.. నువ్వేంటి నాకు చెప్పేదంటూ శ్రీనివాసరావును తిట్టి ఆపై చెంప మీద కొట్టాడు.
ఇది చూసిన శ్రీనివాసరావు కుమారుడు నాగేంద్రబాబు మా నాన్ననే కొడతావా.. అంటూ స్నేహితుడైన ఆంజనేయులతో గొడవపడ్డారు. ఈ సందర్భంలో విచక్షణ కోల్పోయిన ఆంజనేయులు.. నాగేంద్రబాబు మెడపై ఎడమవైపు కత్తెరతో దాడి చేశాడు. ఈ ఘటనలో నాగేంద్రబాబుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు నాగేంద్రబాబును పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నాగేంద్రబాబుకు చికిత్స అందుతుందని.. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా.. ఉందంటూ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పిడుగురాళ్ల సీఐ ప్రభాకర్‌రావు తెలిపారు.
Also Read: