ప్రియుడిపై కత్తితో దాడిచేసిన యువతి ఆత్మహత్యాయత్నం..
ప్రేమించిన ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ఓ యువతి..అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ప్రేమించిన ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ఓ యువతి..అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. గాయాలపాలైన ప్రియుడు, అపస్మారక స్థితిలో ఉన్న ప్రియురాలిని స్థానికుల సమాచారం మేరకు ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పరిశీలించగా… కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంకు చెందిన మాగంటి నాగలక్ష్మి ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తుంది. గూడూరుకు చెందిన గొరిపర్తి పవన్‌కుమార్ పెడన తహసీల్దార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే నాగలక్ష్మి కొంత కాలంగా తనను వివాహం చేసుకోవాలని పవన్ కుమార్‌ని ఒత్తిడి చేసింది. అతడు ఆమె కోరికను తిరస్కరిస్తూ వచ్చాడు.
ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం పవన్ కుమార్ కు ఫోన్ చేసిన నాగలక్ష్మి..ఓ సారి కలిసి మాట్లాడాలని చెప్పింది. ఇద్దరూ కలిసి వక్కలగడ్డలోని తనకు తెలిసిన యువతి ఇంటికి వెళ్లారు. కాసేపటి ఇద్దరి మధ్య వాగ్వాదం తర్వాత మళ్లీ తనను పెళ్లి చేసుకోవాలని గొడవకు దిగింది నాగలక్ష్మి… పవన్‌కుమార్ ఒప్పుకోకపోవడంతో అతడిపై కత్తితో దాడికి పాల్పడింది. ఆపై తానూ కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గదిలోంచి పెద్దగా కేకలు రావటంతో చుట్టు పక్కల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..అపస్మారక స్థితిలో ఉన్న నాగలక్ష్మినీ, గాయాలతో ఉన్న పవన్‌కుమార్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.