రూ.500 కోసం రెండు గంటలపాటు లైన్‌లో నిల్చుని ప్రాణాలు విడిచిన మహిళ..!
కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో.. ప్రజలకు ఆసరగా..వారి వారి జన్ ధన్ ఖాతాల్లో రూ.1500/- జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటిని విడతల వారీగా జమ చూస్తోంది. అయితే తొలి విడతగా జన్‌ధన్ ఖాతాల్లో రూ.500/- జమ అయ్యాయి. అయితే వీటని విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుల వద్ద జనం పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. […]

కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో.. ప్రజలకు ఆసరగా..వారి వారి జన్ ధన్ ఖాతాల్లో రూ.1500/- జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటిని విడతల వారీగా జమ చూస్తోంది. అయితే తొలి విడతగా జన్‌ధన్ ఖాతాల్లో రూ.500/- జమ అయ్యాయి. అయితే వీటని విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుల వద్ద జనం పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తన జన్‌ధన్ అకౌంట్ నుంచి రూ. 500 డ్రా చేసుకునేందుకు.. దాదాపు రెండు గంటలకు పైగా లైన్‌లో నిలబడింది. అయితే బయట నిలబడేసరికి ఎండవేడిమి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయింది. రాష్ట్రంలోని దుమ్కా జిల్లా రాణీఘాగర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతురాలు కెషో రైడీ గ్రామానికి చెందిన కలోని టుడు గా గుర్తించారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం… జన్‌ధన్ అకౌంట్‌లో జమచేసిన డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు బాధిత మహిళ ఎస్‌బీఐ బ్యాంకుకు చెందిన కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లగా.. అక్కడ అప్పటికే పెద్ద ఎత్తున క్యూలైన్ ఉండటంతో.. ఆ లైన్‌లోనే గంటల తరబడి ఉంది. దీంతో ఆమె అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కిందపడిపోయిందని.. వెంటనే అప్పమత్తమైన పక్కన ఉన్నవారు వైద్యులకు సమాచారం అందించగా.. ఆప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.