బైక్ దొంగిలించాడని.. చావబాది చంపారు

కేవలం బైక్ దొంగతనం చేశాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని తీసింది ఓ గుంపు. ఈ అమానుష ఘటన ఝార్ఖండ్‌లోని మూడు జిల్లాల సరిహద్దుల్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఖర్సావాన్ జిల్లాలకు చెందిన శామ్స్ తాబ్రెజ్(24) అనే యువకుడు పూణేలో పని చేస్తున్నాడు. రంజాన్ కోసం సొంత గ్రామానికి వచ్చిన అతడు.. పెళ్లి సంబంధం కుదరడంతో […]

బైక్ దొంగిలించాడని.. చావబాది చంపారు
Follow us

| Edited By:

Updated on: Jun 24, 2019 | 12:55 PM

కేవలం బైక్ దొంగతనం చేశాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని తీసింది ఓ గుంపు. ఈ అమానుష ఘటన ఝార్ఖండ్‌లోని మూడు జిల్లాల సరిహద్దుల్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఖర్సావాన్ జిల్లాలకు చెందిన శామ్స్ తాబ్రెజ్(24) అనే యువకుడు పూణేలో పని చేస్తున్నాడు. రంజాన్ కోసం సొంత గ్రామానికి వచ్చిన అతడు.. పెళ్లి సంబంధం కుదరడంతో అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో జూన్ 18న రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులతో కలిసి జంషెడ్‌పూర్‌కు బయల్దేరాడు. వీరిని దొంగలని అనుమానించిన స్థానికులు దాడికి యత్నించగా.. మధ్యలో తాబ్రెజ్‌తో ఉన్న ఇద్దరు తప్పించుకొని పారిపోయారు. కాని వారికి తాబ్రెజ్ దొంగగా దొరికిపోయాడు.

అంతే.. అతడిపై ఓ మూక విరుచుకుపడింది. కర్రలతో దాదాపు 7గంటలకు పైగా అతడిని చితకొట్టారు. అంతేకాదు ‘జై శ్రీ రామ్’, ‘జై హనుమాన్’ నినాదాలు చేయాలంటూ బలవంత పెట్టారు. తనను విడిచిపెట్టాలంటూ అతడు ఎంత ప్రాధేయపడ్డా.. వారి మనసు కరగలేదు. బాధితుడిని కాపాడేందుకు స్థానికులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో కొన్ని గంటల తరువాత అతడు సృహ తప్పి పడిపోయాడు.

ఇక ఆ తరువాత అతడిని పోలీసులకు పట్టించిన ఆ మూక.. తాబ్రెజ్‌పై కేసును నమోదు చేయించింది. అయితే అప్పటికే తాబ్రెజ్‌కు తీవ్రగాయాలవ్వడంతో స్థానికంగా ప్రాథమిక చికిత్స చేయించిన పోలీసులు అతడిని సెరైకేలా జిల్లా జైలుకు తరలించారు. కానీ అక్కడ అతడి పరిస్థితి క్షీణించడంతో వెంటనే జిల్లాలో ఉన్న సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ తాబ్రెజ్ శనివారం కన్నుమూశాడు.

ఇదిలా ఉంటే పోలీసుల నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మరణించాడని తాబ్రెజ్ కుటుంబసభ్యులు అంటున్నారు. జైలులో ఉన్న తాబ్రెజ్‌ను చూసేందుకు వెళ్లిన సోదరుడి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించారని.. లాఠీ చార్జ్ చేసి, అతడిని కూడా జైలులో పెట్టారని వారు అంటున్నారు. తమ కుమారుడు ఎలాంటి నేరం చేయకపోయినా.. అన్యాయంగా అతడి ప్రాణం తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఆ మూక పట్ల, పోలీసుల పట్ల చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇలా ఉన్నారేంట్రా బాబూ.! వరదలను ఇలాక్కుడా వాడుకోవచ్చా..
ఇలా ఉన్నారేంట్రా బాబూ.! వరదలను ఇలాక్కుడా వాడుకోవచ్చా..
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
100వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో ర‌క్త‌దానం చేసిన న‌టుడు..
100వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో ర‌క్త‌దానం చేసిన న‌టుడు..
భారత టెలికం రంగం మరో అరుదైన ఘనత.. దేశంలో మొదటి గ్రామంలో సేవలు
భారత టెలికం రంగం మరో అరుదైన ఘనత.. దేశంలో మొదటి గ్రామంలో సేవలు
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పుష్ప 2 నుంచి మరో టీజర్..! ఈసారి మరింత కిక్ ఇచ్చేలా..
పుష్ప 2 నుంచి మరో టీజర్..! ఈసారి మరింత కిక్ ఇచ్చేలా..
సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!
సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా, దర్శన టికెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా, దర్శన టికెట్లు
270 సార్లు ట్రాఫిక్‌రూల్స్‌ ఉల్లంఘన..దిమ్మతిరిగే షాకిచ్చిన ఖాకీలు
270 సార్లు ట్రాఫిక్‌రూల్స్‌ ఉల్లంఘన..దిమ్మతిరిగే షాకిచ్చిన ఖాకీలు
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..