అచూకీ లభ్యం కానీ నగల వ్యాపారి అదృశ్యం…

నాలుగు రోజుల క్రితం వ్యాపార నిమిత్తం విజయవాడ నుండి అమలాపురం వచ్చిన నగల వ్యాపారి జైన్ కౌశిక్ కుమార్ మిస్సింగ్ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది.

అచూకీ లభ్యం కానీ నగల వ్యాపారి అదృశ్యం...
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 02, 2020 | 1:59 PM

నాలుగు రోజుల క్రితం వ్యాపార నిమిత్తం విజయవాడ నుండి అమలాపురం వచ్చిన నగల వ్యాపారి జైన్ కౌశిక్ కుమార్ మిస్సింగ్ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. రెండు రోజులపాటు అమలాపురం కొకస్ లాడ్జి లో బస చేసి కౌశిక్ కనిపించకుండాపోయాడు. కాగా, ఇక్కడ పనులు ముగించుకుని వస్తున్నానని బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన కౌశిక్.. తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. రెండు రోజులైన ఇంటికి కాకపోవడంతో.. అతని చిన్నాన్న జైన్ హేమేంద్ర అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న అమలాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు గాలింపు చర్యలు చేట్టారు. ఇప్పటికే పలు షాపుల్లో సీసీ కెమెరా దృశ్యాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

జైన్ కౌశిక్ కుమార్ ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అమలాపురం డీఎస్పీ మాసుం బాషా తెలిపారు. ఫోన్ కాల్స్ డాటా ద్వారా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామన్నారు. అయితే, జైన్ కౌశిక్ కు క్రికెట్ బెట్టింగ్ ముఠాలతోనూ సంబంధాలు ఉన్నాయన్న ఆయన.. 2016లో విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ కేసులో కౌశిక్ అరెస్టు అయ్యాడని డీఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో ఆ కోణం లో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు