కూతురు చదవకుండా టీవీ చూస్తోందని….
కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే రాక్షసిగా మారింది. కన్నతల్లే కూతురుని చికతబాదిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది.
కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే రాక్షసిగా మారింది. కన్నతల్లే కూతురుని చికతబాదిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. కూతుర్ని అతి దారుణంగా కొడుతున్న దృశ్యాలు సెల్‌ఫోన్లలో చిత్రీకరించిన స్థానికులు సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో ఆ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మేగ్యతండాలో ఘటన చోటు చేసుకుంది. ఓ గిరిజన మహిళ తన కూతురును చితకబాతని వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పదో తరగతి చదువుతున్న బాలిక నిత్యం టీవీ చూస్తూ చదువుల్లో వెనకబడుతుందని, పనికి రాని మొద్దులా తయారవుతుందని ఆవేదన చెందిన తల్లి ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంట్లో వస్తువులు మాయమవుతున్నాయనే కోపంతో రోకలితో బాదుతూ కాళ్లతో తొక్కుకుంటూ తన కోపాన్ని ప్రదర్శించింది.
తల్లితో పాటు ఆమె కొడుకు కూడా రెచ్చిపోయాడు. పైశాచికంగా ప్రవర్తించి అక్కను చితకబాదాడు. జుట్టుపట్టి లాగుతూ పిడిగుద్దులు గుద్దాడు. తల్లీ కొడుకులు కలిసి బాలికను అతి దారుణంగా చితకబాదారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారడంతో తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.