Inter Student Suicide: మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు మందలించారని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Inter Student Suicide: చిన్నపాటి కారణాలతో కొందరు విద్యార్థులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో.. మార్కులు తక్కువగా..
Inter Student Suicide: చిన్నపాటి కారణాలతో కొందరు విద్యార్థులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో.. మార్కులు తక్కువగా వచ్చాయని ఇంట్లో మందలించారనే కారణాలతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఎన్నో ఉన్నత శిఖరాల ఎత్తు ఎదగాల్సిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమైన విషయమే. తాజాగా ఓ విద్యార్థిని రైలు పట్టాల కింద పడి ఆత్మహత్యకు పాల్పడటంతో ఆమెకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. వివరాల్లోకి వెళితే.. తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ఫలితాలు గురువారం విడులైన విషయం తెలిసిందే. నల్గొండలోని గాంధీనగర్‌కు చెందిన జాహ్నవి (16) అనే విద్యార్థికి ఇంటర్‌లో మార్కులు తక్కువగా వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడింది. శుక్రవారం రైలు కింద పడి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. తమ కళ్లముందు తిరిగిన కుమార్తె ఒక్కసారిగా ఈ ఘాతుకానికి పాల్పడటంతో కన్నీరుమున్నీరవుతున్నారు. కాస్త మందలిస్తే బాగా చదువుతావని అనుకున్నవమ్మా.. ఇలా ప్రాణాలు తీసుకుంటావని అనుకోలేదని బోరున విలపించారు.
కాగా, ఇలాంటి చిన్నపాటి కారణాలతో విద్యార్థులు ప్రాణాలు తీసుకోవద్దని, విద్యార్థుల భవిష్యత్తు ఇంకా ఎంతో ఉందని పోలీసులు సూచిస్తున్నారు. విద్యార్థులకు తక్కువ మార్కులు వస్తే వారిని మందలించకుండా వారిని వెన్నుతట్టి ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: