Crime News: అనుమానమే పెనుభూతమై ప్రాణాలు తీసింది.. అర్ధరాత్రి ఆ ఇంట్లో అసలేం జరిగింది..?
Visakhapatnam Crime News: వాళ్లిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు.. స్వయానా అక్క కూతురుని పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగి మూడేళ్లయింది. దాంపత్యంలో మనస్పర్థలు మొదలయ్యాయి. ఆలుమగలు
Visakhapatnam Crime News: వాళ్లిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు.. స్వయానా అక్క కూతురుని పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగి మూడేళ్లయింది. దాంపత్యంలో మనస్పర్థలు మొదలయ్యాయి. ఆలుమగలు అన్నాకా.. చిన్న చిన్న మనస్పర్ధలు సాధారణం. కానీ ఒకేసారి ఆమెను హత్య చేసి ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి వచ్చిందంటే ఏమనాలి. ఇప్పుడు ఇదే విశాఖ పోలీసులను, ప్రజల మదిని తొలిచేస్తుంది. అర్ధరాత్రి ఆ ఇంట్లో జరిగిన ఘటనకు కారణమేంటి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. విశాఖపట్నం నగరంలోని శ్రీహరిపురం గొల్లలపాలేంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అనుమానమే.. ఇద్దరి ప్రాణాలు పోయేలా చేసిందని పేర్కొంటున్నారు.
శ్రీహరిపురం గొల్లల పాలెంలో మాధవి, నాగేశ్వరరావు అనే భార్య భర్తలు నివాసముంటున్నారు. వారికి మూడేళ్ల క్రితం వివాహమైంది. పిల్లలు లేరు. గతం నుంచి కూడా ఇద్దరి మధ్య వాగ్వివాదాలు చోటుచేసుకునేవి. భార్యపై భర్తకు అనుమానం కూడా ఉండేది. గత రాత్రి ఏం జరిగిందో ఏమోకానీ.. సహనం కోల్పోయిన నాగేశ్వరరావు భార్య మాధవిని హత్య చేశాడు. తలపై మోది చంపేశాడు. ఆ తర్వాత నాగేశ్వరరావు కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆధారాలను సేకరించి మృతదేహాలను మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కానీ తరచూ జరిగే కుటుంబ కలహాలే ఈ రెండు ప్రాణాలు బలి అయ్యేందుకు కారణం అయ్యాయా అంటే.. విచారణ పూర్తిగా కొనసాగితే గాని తెలియదంటున్నారు పోలీసులు. నాగేశ్వరరావు భార్య పట్ల విసుగెత్తి చంపేశాడా..? చిన్న చిన్న మనస్పర్థలకు అంతలా హత్య చేసే స్థాయికి వెళతాడా..? ఇవే తేలాల్సి ఉంది. ఏదేమైనా క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.
భర్త ఒక క్షణం ఆలోచించినా.. దక్కేవేమోనని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణను ప్రారంభించారు. భార్యపై అనుమానమే నాగేశ్వరరావు హంతకుడిగా మార్చి ఆ ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకొచ్చిందేమోనని.. పోలీసులు భావిస్తున్నారు.
Also Read: